ఫోకస్

ఫిరాయింపుల తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారం అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నమ్మబలికారు. ప్రజలు కూడా నిజమేనన్న భావనతో టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించారు. అందలమెక్కిన చంద్రశేఖర్ రావు ఒకవైపు కుటుంబ పాలన చేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను అణచివేసి పాలన కొనసాగిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బొటాబొటీగానే టిఆర్‌ఎస్‌కు సీట్లు లభించాయి. కాంగ్రెస్‌కు 21 అసెంబ్లీ స్థానాలను, టిడిపికి 15 స్థానాలను ప్రజలు అప్పగించారు. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే అధికారపక్షం జాగ్రత్తగా పాలన చేస్తుందని జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. అధికారంలో ఉండే పార్టీ ప్రతిపక్షాలను తొక్కి పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ మాత్రం అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న భావనతో ఉంది. అందుకే టిడిపి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో డజను మందిని టిఆర్‌ఎస్ కారులో ఎక్కించుకోవడం అత్యంత బాధాకరం. అంతేకాదు కాంగ్రెస్ నుంచి, వైకాపా నుంచి అంతకుముందు బహుజన సమాజ్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. బిఎస్‌పి నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో కలుపుకున్నారు. టిడిపి, బిఎస్‌పి ఎమ్మెల్యేలకూ మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. బంగారు తెలంగాణ అంటే.. ఇలా చేయడమేనా? రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకులు నైతిక విలువలు పాటిస్తేనే, సమాజంలో కూడా అవి మరింత పెంపొందుతాయి. కానీ ప్రజాప్రతినిధులుగా ఒక పార్టీనుంచి ఎన్నికైనవారు తమ పదవీకాలం ముగిసేంతవరకూ ఆ పార్టీలోనే కొనసాగాలి. ఒకవేళ మరో పార్టీలో చేరాలనుకుంటే, ఆ పార్టీకి రాజీనామా చేసి చేరాలి. రాజీనామా చేయకుండా వచ్చేవారిని ఆయా పార్టీలూ చేర్చుకోరాదు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. ఒకటింట మూడోవంతు మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఉన్నపళంగా మరో పార్టీలో చేరేందుకు అవకాశం లేకుండా చేశారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీ లేదా ఎమ్మెల్యే మారో పార్టీలో చేరితే సదరు ప్రజాప్రతినిధి సభ్యత్వం రద్దయ్యేలా చట్టాన్ని సవరించారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం సమర్థవంతంగా అమలు జరగడం లేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫిరాయింపులు భారీగానే జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగత లాభంకోసం ఇతర పార్టీలో చేరడంవల్ల తమను ఎన్నుకున్న ప్రజలను అవమానించేనట్లే అవుతుందని సదరు ఫిరాయింపుదారులు గమనించాలి.

- రమ్యారావు రేగులపాటి
అధికార ప్రతినిధి, టి.పిసిసి