ఫోకస్

విశ్వాసం కోల్పోతే.. తప్పదు మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరాయింపులను అంత తేలిగ్గా కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు అంటే ఆ పార్టీ ద్వారా ప్రజలకు అలాగే రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేయాలనే తృష్ణ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మంది ఓటర్లుంటే ప్రధాన రాజకీయ పక్షానికి కనీసం లక్ష మంది కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు ఉంటారు. సాధారణంగా ఒక పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం పనితీరును అంచనా వేసుకునే ఆ పార్టీని విశ్వసిస్తూ ఉంటారు. ప్రధానంగా ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఉన్న పార్టీతో అలాగే ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. అయితే ఎప్పుడైతే ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ భవిష్యత్తు, తమ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంలా కనిపిస్తున్నప్పుడు సాధారణంగానే ఆ పార్టీ నాయకుల్లో నిరుత్సాహం చోటుచేసుకుంటుంది. ఆ పార్టీ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించలేమని, ఈ రాష్ట్రానికి ఏ మేర కూడా మేలు చేయలేమని భావిస్తారు. ఆ పరిస్థితుల్లో మునిగే పడవలో కంటే ఒడ్డున చేర్చే పడవ ఎక్కటానికి సాధారణంగా అందరూ ఉవ్విళ్లూరుతుంటారు. అసలు ప్రజలకు ఏదో చేయాలనే తపనతోనే ఆయా పార్టీల్లో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. అయితే అదే పార్టీ బలహీనపడుతున్న పరిస్థితుల్లో తనను నమ్ముకున్న అనుచర గణంతో తమ భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని పార్టీలు మారుతుండటం స్వాతంత్య్ర కాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నది. అంతమాత్రాన పార్టీ ఫిరాయింపుదారులను తక్కువగా చూడటానికి వీల్లేదు. ఇక ఫిరాయింపుల చట్టం అనేది చట్టసభలో స్పీకర్ పరిధిలో ఉంటుంది. ఆపై న్యాయస్థానాలు ఎటూ ఉండనే ఉన్నాయి.

- కొనకళ్ల నారాయణరావు
పార్లమెంటు సభ్యుడు, మచిలీపట్నం