ఫోకస్

విశ్వసనీయతే కొలమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు మంచి సంప్రదాయం కాదు. అనివార్యమైన పరిస్థితుల్లో విశ్వసనీయతే కొలమానంగా భావించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్నారు. సైద్ధాంతిక ప్రాతిపదికన మార్పులు, చేర్పులు జరగటం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో బలహీనమైన అభ్యర్థులున్నారు? ప్రజాదరణ ఎవరికి ఉంది? వారివల్ల భవిష్యత్తులో పార్టీకి ఏదైనా మంచి జరుగుతుందని ఆశించినప్పుడు ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తే తప్పులేదు. ఎన్నికలనేవి నిరంతర ప్రక్రియ. ప్రజాదరణ ఉన్న పార్టీలు, నాయకులు అధికారంలోకి వస్తారు. ఒకవేళ పాలన గాడితప్పితే వ్యతిరేక ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. ఇక నియోజకవర్గాల వారీగా పార్టీలు మారాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం పార్టీ ప్రతిష్ఠతోపాటు నేతల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. రాజకీయ భవితవ్యం కాపాడుకునే ప్రయత్నాల్లో నాయకులు పార్టీలు మారటం సహజం. అదే క్రమంలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో దీటైన అభ్యర్థులకోసం పార్టీలు అనే్వషించే క్రమంలో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించటం రివాజుగా మారింది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో అనర్థాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. పార్టీలో ఆంతరంగిక స్పర్థలు, విభేదాలు, గ్రూపులు ఇందులోంచి పుట్టినవే. అంతేకాదు సిట్టింగ్ అభ్యర్థులతోపాటు అంకితభావంతో పనిచేసే ఆశావహులు అవకాశం కోల్పోతున్నారు. ఒకరకంగా పార్టీ బలపడినా మరోవైపు అసంతృప్తి కారణంగా బలహీన పడుతోంది. ఈ పరిస్థితులను సమతుల్యం చేసుకోవాలి. న్యాయపరంగా పార్టీ ఫిరాయింపులు నిషిద్ధం. అయినప్పటికీ కోర్టులు కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నైతికంగా పార్టీలు, నేతలే ఆలోచించుకోవాలి. పార్టీని బలోపేతంచేసే క్రమంలో ఇతర పార్టీలనుంచి నాయకులను ఆహ్వానించ వచ్చుకానీ విచ్చలవిడితనం పనికిరాదు. ఫిరాయింపులు జరిగినప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మారుతున్న రాజకీయ పరిస్థితులనుబట్టి ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. ఓ నియోజకవర్గంలో మన గెలుపు సాధ్యం.. అయితే అవకాశం మాత్రమే లేదనుకున్నప్పుడు, ప్రస్తుతమున్న పార్టీలో చోటుదక్కదని అనుకున్న పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మారటంలో తప్పు లేదు. రాజకీయ పార్టీలో సిద్ధాంతాలు వేరు. అవలంభించే విధానాలు వేరు. విధానాలతో విభేదించి రాజకీయాల్లోనే మనుగడ సాగించాలనుకున్నప్పుడు మార్పులు అనివార్యం. ప్రస్తుతం పార్టీలలో కుల, మత, వర్గ, సామాజిక సూత్రీకరణలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాయకుల సమర్థతను పరిగణనలోకి తీసుకోవటం లేదు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే క్రమంలో సొంత నిర్ణయాలు తీసుకోక తప్పటంలేదు.

- రాయపాటి సాంబశివరావు,
సీనియర్ పార్లమెంటేరియన్, నరసరావుపేట ఎంపీ