ఫోకస్

ప్రజల మనోభావాలను గౌరవించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీల ఫిరాయింపులు దురదృష్టకరం. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఉండటంతో కొందరు నేతలు తప్పని పరిస్థితిల్లో ఇతర పార్టీలోకి వెళ్ళాల్సి వస్తోంది. ప్రజల మద్దతుతో గెలిచి వారి మనోభావాలకు అనుగుణంగా మెలగాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనోభావాలను కచ్చితంగా గౌరవించాల్సిందే. కొంతమంది ప్రజాప్రతినిధులు కొన్ని రోజులు ఒక పార్టీలో, మరికొన్ని రోజులు ఇంకో పార్టీలో ఉంటున్నారు. వారు పార్టీ మారాల్సిన పరిస్థితిని తప్పనిసరిగా ప్రజలకు తెలియజెప్పడంతోపాటు చట్టానికి కూడా బాధ్యులుగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత టిఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలబడింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నది. అందుకే ఆ పార్టీ ప్రజల మన్ననలు పొందుతున్నది. ప్రజాభిప్రాయాలను గౌరవించే ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి నెలకొంటుంది.

- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ