ఫోకస్

బాల్యాన్ని హరిస్తున్న ‘కార్పొరేట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న పిల్లల బాల్యాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు హరిస్తున్నాయి. సదరు సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చివేశాయి. విద్యార్థులలో మానసిక వత్తిడికి కారణమవుతున్నాయి. కొన్ని వృత్తుల పట్ల మన సమాజంలో అసంబద్ధమైన ఆరాధన భావం నెలకొంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, పెద్దస్థాయి ఉద్యోగులు కావాలని కోరుకుంటున్నారు. పిల్లలతో భట్టీయం వేయించి, ఎక్కువ మార్కులు సంపాదించి పెట్టే కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్పించాలని తల్లిదండ్రులు ఉవ్విళ్ళూరుతున్నారు. విద్యా వ్యాపారంలో తమ సంస్థకు ఎక్కువ ర్యాంకులు, మార్కులు వచ్చాయని చెప్పుకుని మరింత మంది పిల్లలను చేర్చుకోవాలన్న ఆలోచనతో కార్పొరేట్ విద్యా సంస్థలు భారీగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం శోచనీయమే! పిల్లల బాల్యాన్ని హరించి వారిని తీవ్రమైన మానసిక వేదనకు సదరు విద్యా సంస్థలు గురి చేస్తున్నాయి. ఇదొక విష వలయంగా మారింది. సమాజానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు! పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ సమస్య వచ్చిన నేరుగా తమ ఇంట్లో చెప్పుకుని, సమస్యను పరిష్కరించుకునే వాతావరణం నేటి విద్యార్థులకు అవసరం! క్షణికావేశంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన పిల్లల జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. ముఖ్యంగా సమాజంలో ఏ వృత్తీ తక్కువది కాదు! వృత్తి ఏదైనా దానిని దైవంతో సమానంగా భావించి, నైపుణ్యం నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయి. అన్ని వృత్తులను గౌరవించి, మానవీయ విలువలను సమాజంలో నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-డాక్టర్ యనమదల మురళీకృష్ణ
ఎండి, ఫ్యామిలీ హెల్త్ సెంటర్, కాకినాడ