ఫోకస్

తల్లిదండ్రుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తొలుత తల్లిదండ్రులదే. ఆ తర్వాత ఉపాధ్యాయులదీ. తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలన్న ఆకాంక్షతో, బాగా చదువుకోవాలని, టాప్ ర్యాంకర్లు కావాలన్న పట్టుదలతో పిల్లలపై తల్లిదండ్రులే వత్తిడి చేస్తున్నారు. తమ పిల్లల అభిరుచి మేరకు నడుకోవడం లేదు. ఉదాహరణకు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులై, ఉన్నతమైన పదవుల్లో ఉండి, తమ పిల్లలు కూడా అదే స్థాయిలో ఉన్నతమైన పదవుల్లోకి రావడానికి బాగా చదువుకోవాలని వత్తిడి తెస్తుంటారు. కానీ తమ పిల్లల అభిరుచి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. కొన్ని కుటుంబాల్లో మరీ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఆట-పాటలు అసలే ఉండవు. ఎంతసేపు చదువుకోవాలంటారు. అలా చేస్తే ఆ పిల్లల శరీరధారుడ్యం ఎలా పెరుగుతుంది? కొన్ని కుటుంబాల్లో మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచి మేరకే ప్రోత్సహిస్తున్నారు. ఇక పిల్లలు పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో మరీ ఎక్కువగా ఉంటోంది. విద్యార్థులను ఉదయం 7.30 లేదా 8 గంటల నుంచి సాయంత్రం వరకూ చదువు తప్ప మరో అంశమే ఉండడం లేదు. తమ విద్యా సంస్థ విద్యార్థులే టాపర్లుగా, గోల్డ్ మెడల్స్ పొందాలని రుద్దుతున్నారు. దీంతో విద్యార్థులు అటు ఇంట్లో తల్లిదండ్రులతో, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులతో వేగలేక తీవ్రమైన వత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా టివీల్లో ప్రసారమవుతున్న క్రైం స్టోరీస్, ఇంకా ఇతరత్రా కార్యక్రమాలూ బాగా దెబ్బతీస్తున్నాయి. కొంతమంది విచ్చలవీడితనానికి వెళ్ళి డబ్బులకోసం చైన్ స్నాచింగ్‌లు, బైక్‌లు, ఇతరత్రా వస్తువుల దొంగతనాలకూ పాల్పడుతున్నారు. ఇటువంటి వాటినుంచి పిల్లలను కాపాడుకోవాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. ఆ తర్వాత తమ విద్యాసంస్థకు వచ్చే విద్యార్థుల అభిరుచులను ఉపాధ్యాయులు తెలుసుకుని వారిని ఆ రంగాలపై దృష్టి సారించేలా కృషిచేయాలి. తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా పిల్లల పట్ల దురుసుగా కాకుండా స్నేహితులుగా ఉంటూ ప్రోత్సహించాలి.

- సునీతా రావు, అడ్వకేట్, టి.పిసిసి అధికార ప్రతినిధి