ఫోకస్

ప్రభుత్వాల్లో కదలిక రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మహత్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను తీవ్రమైన మానసిక వత్తిడికి గురిచేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్ధులను వత్తిడికి గురిచేయడం కొత్తకాదు. గత 20 సంవత్సరాలుగా ఈ ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆత్మహత్యలపై కమిటీలను నియమించి చేతులుదులుపుకుంటున్నాయి. ఆత్మహత్యలను నివారించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు కదలాలి. తల్లితండ్రుల్లోనూ మార్పులు రావాలి. తమ పిల్లలకు ఏదో ఇష్టమో అది చదివించాలి. తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారు. ఐఐటి, మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలకు ఏడవ తరగతి నుంచే కోచింగ్‌లు ఇస్తున్నారు. టెన్త్, ఇంటర్‌లో పిల్లలకు విరామం, ఆట, పాటలేకుండా రాత్రి 10 గంటల వరకు కోచింగ్‌ల పేరిట అలసటకు గురిచేస్తున్నారు. పైగా ర్యాంకులు సరిగా రాకపోతే, విద్యార్థులను మందలించడం జరుగుతోంది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు శక్తికి మించి టార్గెట్‌ను విధిస్తున్నారు. దేశంలో మరే ప్రాంతంలో లేని విచిత్రమైన బోధనా పద్ధతులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఈ జబ్బు కర్నాటకకు కూడా సోకింది. ప్రభుత్వ కాలేజీల వ్యవస్థ కుప్పకూలింది. అక్కడ సరైన ప్రమాణాలను పాటించకుండా ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోంది. కాలేజీ లెక్చెరర్లలో కూడా మార్పులు రావాలి. కేవలం ఐఐటి, మెడిసిన్ చదివితేనే చదువని, మిగతా చదువులు చదువులు కాదన్న దురభ్రిప్రాయం విద్యార్థుల తల్లితండ్రుల్లో ప్రబలించింది. తమ పిల్లలు పెద్ద ఇంజనీర్, డాక్టర్ కావాలని, విద్యార్థుల తల్లితండ్రులు అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. దీనివల్ల కార్పొరేట్ కాలేజీలు లాభాలు దండుకుంటున్నాయి. తల్లితండ్రులు రుణ బాధితులవుతున్నారు. పిల్లలు మానసిక రోగులుగా తయారవుతున్నారు. ప్రతి కాలేజీలో సైకాలజిస్టులను నియమించాలి. అలాగే ప్రతి ఏరియా ఆసుపత్రుల్లో సైక్రియాట్రిస్టులను నియమించాలి. దీనివల్ల విద్యార్ధులు వీరి వద్దకు వెళ్లి తమ భయాలు, ఆందోళనను పంచుకుంటారు. కాని రాష్ట్రంలో ఎన్నిచోట్ల మనస్తత్వ శాస్తవ్రేత్తలు, నిపుణులు అందుబాటులో ఉంటారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి

- ఎస్ సలాం అధ్యక్షుడు ఏపీ వైకాపా విద్యార్థి సంఘం