ఫోకస్

ఒత్తిడే ప్రధాన కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావిభారత పౌరులైన విద్యార్థుల ఆత్మహత్యలు, బలవన్మరణాలకు ఒత్తిడే ప్రధాన కారణం. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులపై చదువు పేరుతో పెడుతున్న ఒత్తిడి వలనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయ. నాలుగు దశాబ్దాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్న నేను ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలను. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే అంశంపై ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిషన్‌ను వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 21 సిఫార్సులు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఇదే అంశంపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చక్రపాణి కమిటీని వేశారు. ఈ రెండు కమిటీల సిఫార్సుల్లో కనీసం ఏ ఒక్క సిఫార్సును కూడా అమలు చేయలేకపోవటం ఘోరాతిఘోరం. ప్రధానంగా ఈ ఒత్తిడిని తగ్గించాలంటే కచ్చితంగా ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే తరగతులు నిర్వహించాలి. అదీ సెలవు దినాల్లో అసలు నిర్వహించకూడదు. ఇక మార్కుల పేరిట అర్ధాంతరంగా సెక్షన్‌లు మారుస్తుండటంతో ఇంటినుంచి ఒత్తిళ్లు, యాజమాన్యాల నుంచి బెదిరింపులు, తోటి విద్యార్థులతో ఇమడలేకపోవటం వీటన్నింటితో ఒత్తిడి పెరుగుతున్నది. ఇక హాస్టళ్లలో వసతులను మరింతగా మెరుగుపరచాల్సి ఉంది. పై అంశాలన్నింటినీ కచ్చితంగా అమలు చేయగల్గితే నూటికి నూరు పాళ్లు ఆత్మహత్యలు తగ్గిపోతాయి
.
- కెఎస్ లక్ష్మణరావు శాసన మండలి మాజీ సభ్యులు