ఫోకస్

పెద్దల్లోనే మార్పురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు మానసిక ఒత్తిడికి గురికాకుండా, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే వారి తల్లిదండ్రుల ఆలోచనల్లో, ధృక్పథంలో మార్పురావాలి. తమ పిల్లలపై వత్తిడిలేని విధంగా విద్యాబోధన ఉండేలా చూసుకోవాలి. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ పిల్లలు భాగస్వామ్యం అయ్యేలా వాతావరణం కల్పించాలి. అలాంటి వాతావరణంలో చదువుకునే విద్యార్థుల్లో దాగి ఉండే సృజనాత్మకత వెలికి వస్తుంది. అలాంటివారే దేశానికి ఉపయోగపడే భావిభారత పౌరులుగా రూపొందుతారు. వివిధ రంగాల్లో దేశానికి పేరు తీసుకురాగల ఉత్తమమైన పౌరులుగా మారగలరు. తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లలు డాక్టరు కావాలని లేదా ఐఐటిలో చదవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు అనువుగా పాఠశాల స్థాయినుండే విద్యార్థుల్లో మానసిక వత్తిడి ఎక్కువగా ఉండే కార్పొరేట్ విద్యాసంస్థలల్లో చేర్పిస్తారు. ఇక్కడే విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు మొదలవుతుంది. విద్యార్థుల శక్తిసామర్థ్యాలలో భిన్నస్థాయిలు ఉంటాయి. ఇందుకు కారణం వారి కుటుంబ నేపథ్యమే. ప్రాథమిక స్థాయిలో పిల్లలు చదువుపట్ల శ్రద్ద, ఆసక్తి కనబరచేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, పర్యవేక్షణ అవసరం. ప్రభుత్వం నిర్ణయించే పాఠ్యాంశాలను సమయసారిణి ప్రకారం బోధిస్తే పిల్లలు ఆసక్తిగా చదివి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయిలోనూ ‘కార్పోరేట్’ కల్చర్ రావడంతో వేళాపాళా లేకుండా పనిదినాలు, సెలవులు అన్న తేడాలేకుండా బోధన సాగడంవల్ల విద్యార్థుల్లో విరక్తి కలుగుతుందే తప్ప, ఆసక్తి కనిపించదు. ఈ విషయం కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలిసినప్పటికీ, యాజమాన్యం నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తారే తప్ప, సామాజిక అవగాహనతో పనిచేయలేరు. కొంతమంది పిల్లలు చదువు విషయంలో ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని ఎంచుకుని ఒక పథకం ప్రకారం చదువుతారు. చదువుతో పాటు ఇతర మానసికోల్లాస కార్యక్రమాల్లో కూడాపాల్గొంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సహకారంతో పాటు విద్యాసంస్థల్లో వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో బలవంతపు చదువు ఉంటుంది. విద్యార్థికి ఇష్టం ఉన్నా లేకపోయినా అస్తమానం పుస్తకాలను ముందేసుకుని చదవాల్సి రావడం, తల్లిదండ్రుల నుండి సహకారం లేకపోవడం పెద్దలోటుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలోనే విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయి, చదువుపట్ల అనాసక్తి, జీవితం పట్ల విరక్తి కలిగి తీవ్రపరిమాణాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో పిల్లలస్థాయిని అనుసరించి చదువు చెప్పే విధానం ఉండాలి. కార్పొరేట్ సంస్థలకు పూర్తిస్వేచ్ఛ ఇవ్వకుండా, ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆత్మహత్యలు ఆగిపోతాయనడంలో సందేహం లేదు.

- డాక్టర్ ఏ. శ్రీరాములు సంయుక్త సంచాలకులు (ఎఫ్‌ఎసి), కాళాశాల విద్యాశాఖ