ఫోకస్

క్షణికావేశంలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు క్షణికావేశానికిగురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయి. మానసిక వేదన, ఆవేశం, వత్తిడి, అవహేళన తదితరాలు వ్యక్తిగతంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయ. సమస్యలను అధిగమించి జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలే కానీ అర్ధాంతరంగా తనువులు చాలిస్తే తల్లిదండ్రులకు తీరని దుఃఖమే మిగులుతుంది. ఇలాంటి విద్యార్థులను గుర్తించి ప్రధానంగా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాన్ని చూపిస్తే కొంతవరకైనా ఆత్మహత్యలను నివారించవచ్చు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధానంగా కాలేజీ స్థాయిలోనే ఉన్నాయి. బాల్య, కౌమార దశల నుంచి యవ్వన దశకు చేరుకుంటున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం అధికంగా ఉంటోంది. మానసిక నిపుణుల ద్వారా విద్యార్థులను చైతన్యపర్చాల్సిన అవసరం ఉంది.

- పి.బాబుమోహన్, అందోల్ ఎమ్మెల్యే, తెలంగాణ