ఫోకస్

మార్కులే జీవితం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు మార్కులే జీవితం కాదు అన్న భావన నుంచి బయటపడాలి. విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధి దిశగా విద్యను అందించాలి. నేడు కార్పొరేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు మానసిక వత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బోధన పేరుతోను, స్టడీ అవర్స్ పేరుతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను మానసిక వత్తిడికి గురిచేయడం సరికాదు. అలాంటి వత్తిళ్లకు తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. కేవలం బట్టీపట్టి చదివించే చదువుల వల్ల విద్యార్థులు స్వతాహాగా ఆలోచన చేసే స్థాయిని మరచిపోతున్నారు. కేవలం మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఎన్ని ప్రశ్నలు కంఠస్త చేశామన్నదానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎక్కువ మార్కులకోసం ఇబ్బడిముబ్బడిగా మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేస్తున్నారు. మరోపక్క ఆట స్థలాలు లేకపోవడం, ఆటలు ఆడుకునేందుకు సరిపడా సమయం లేకపోవడం వల్ల విద్యార్థులు మానసిక వత్తిడికి గురవుతున్నారు. విద్యార్థులు వంద మార్కులు సాధించినా, సాధించలేకపోయినా జీవితంలో ఎన్నో ఇతర ఉపాధి అవకాశాలు ఉన్నాయన్న ధైర్యం విద్యార్థులకు కలిగించాలి. మెడికల్ లేదా ఇంజనీరింగ్ సీటు రాకపోతే జీవితం కోల్పోతామన్న అపోహ నుంచి బయటపడాలి. అంతేగాకుండా విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు చదువు పేరుతో ఆహార నియమాలను పట్టించుకోవడం లేదు. అంతేగాకుండా ప్రభుత్వం కూడా కార్పొరేట్ స్కూళ్లకి సరైన డైరెక్షన్ ఇవ్వాలి. దిగులుగా ఉన్న స్టూడెంట్స్‌కు సైకలాజికల్‌గా కౌనె్సలింగ్ ఇవ్వాలి. విద్యార్థుల అందరి గ్రహణ శక్తి ఒకే మాదిరిగా ఉండదు కనుక స్లో లెర్నర్స్‌కి స్లోగా చెప్పాలి. స్పీడ్‌గా అందుకున్న వారికి దానికి తగ్గట్టుగా చెప్పాలి. ఆ విధంగా విద్యార్థులు మానసిక వత్తిడికి గురికాని విధంగా పాఠాలను బోధించాలి. అలాంటపుడే ఆత్మన్యూనత నుంచి విద్యార్థులు బయటపడే అవకాశం ఉంది. మరోపక్క విద్యార్థులకు ఆటలు ఆడుకునే విధంగా తగిన సమయం కేటాయించాలి. ఈ విధంగా విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, స్నేహితులు ఇలా అన్ని వర్గాల నుంచి వారికి ప్రోత్సాహం ఉండేలా చూడాలి. అలాంటపుడే వత్తిడి నుంచి బయటపడగలుగుతారు.

- ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు వైస్ చాన్సలర్, సెంచూరియన్ వర్శిటీ