ఫోకస్

ప్రభుత్వ ఉద్యోగులపై పెరిగిన పనిభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యంతో అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఖాళీలున్నాయి. ఫలితంగా ఉద్యోగులకు పనిభారం విపరీతంగా పెరిగింది. ఇటీవలి కాలంలో నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్స్ లేవు. నియామకాలు లేకపోతే ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతుంది. ఫలితంగా పనిలో నాణ్యత ఉండదు. నియామకాల విషయంలో న్యాయ సంబంధమైన చిక్కులు కొన్ని అంశాల్లో మాత్రమే ఉంటాయి. దీనిని ఆధారంగా చేసుకుని మాత్రమే ఉద్యోగ నియామకాలను నిలిపివేయడం సరికాదు. ఏ ఒక్కరికీ రిక్రూట్‌మెంట్స్‌ను ఆపివేయమని చెప్పే హక్కు లేదు. అయితే రాష్ట్రంలో ఆర్థిక సమస్యల కారణంగా రిక్రూట్‌మెంట్స్‌లో వేగం లేదని తెలుస్తోంది. తహశీల్దారు కార్యాలయాల్లో తగినంత మంది సిబ్బంది లేరు. తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం లేదు. ఎంతమంది తహశీల్దార్లకు కంప్యూటర్లు వాడే పరిజ్ఞానం ఉంది? అధికారులకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ఇబ్బందులు తప్పవు, విఆర్‌ఒలు తగినంత మంది లేరు. మూడు గ్రామాలకు ఒక విఆర్‌ఒ వంతున పనిచేస్తున్న పరిస్థితులున్నాయి. క్లాస్-4 ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నా కొత్త నియామకాలు జరగడం లేదు. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. కీలకమైన ప్రభుత్వ శాఖల్లో ఈ వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వడం మంచిది కాదు. అన్నిచోట్లా ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. వెబ్‌లాండింగ్ వంటి కీలకమైన ప్రక్రియను సైతం ఔట్‌సోర్సింగ్ చేతుల్లో పెట్టడం ప్రమాదకరం. ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య మరింత జఠిలమవుతుంది. ప్రభుత్వం తక్షణం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం ఎంతైనా అవసరం.

-పితాని త్రినాథరావు ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు