ఫోకస్

ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటు ద్వారా జోనల్ వ్యవస్థను సత్వరం పునరుద్ధరించి లోకల్, నాన్‌లోకల్ విధానంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 370-డి అధికరణ అమలులో ఉన్న కారణంగా ఉద్యోగాల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని భావించగా ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించిన కారణంగా వెనక్కి తగ్గి రాష్ట్రంలో మరిన్ని జోన్ల ఏర్పాటుకు మంత్రులతో, ఉన్నతాధికారులతో ఉపసంఘాలు ఏర్పాటు చేసారు. జోనల్ వ్యవస్థ రద్దు, పునర్‌వ్యవస్థీకరణకు రాష్టప్రతి ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే జోన్ల వ్యవస్థలో సమతుల్యత లోపించింది. 13 జిల్లాలున్న ఆంధ్ర ప్రాంతంలో నాలుగు జోన్లుంటే, 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో కేవలం రెండు జోన్లు మాత్రమే ఉండటంతో ఉద్యోగ నియామకాల్లో సమతుల్యత లోపించిందని అప్పట్లోనే గుర్తించారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కారణంగానే ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత నీళ్లు, నిధుల విషయంలో క్లారిటీ వస్తున్నా.. ఉద్యోగాల నియామకాలు, ఆర్టికల్ 370తో ఏర్పడే సమస్యలపై ప్రభుత్వానికి క్లారిటీ లేని కారణంగా ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జోన్ల వ్యవస్థపై, ఉద్యోగాల నియమకాల సమస్యపై అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రభుత్వం గుర్తించి ప్రాధాన్యత అంశంగా తీసుకుని యుద్ధప్రాతిపదికన జోన్ల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ జరిపి ఉంటే ఇప్పుడు ఉద్యోగాల నియమాకల్లో ఇబ్బందులు, ఆందోళనలు ఉండేవి కావు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంత్రివర్గ, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సబ్‌కమిటీల నివేదికలు త్వరగా తెప్పించుకుని సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి.

- మఠం శివశంకర్ అధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్