ఫోకస్

విధాన లోపమే వివాదాలకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగ నియామకాల్లో అనుసరించాల్సిన ప్రభుత్వ విధానాల్లో గందరగోళంతోనే రిక్రూట్‌మెంట్‌లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల ప్రక్రియ సాఫీగా సాగేందుకు, న్యాయపరమైన వివాదాలు అధిగమించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చట్టబద్ధ విధానాలు రూపొందించుకోవాలి. పాత జోనల్ సిస్టమ్‌లో ఉమ్మడి జిల్లాల ద్వారా రిక్రూట్‌మెంట్ సాగించాలా లేక కొత్త జోనల్ పద్ధతిలో నూతన జిల్లాల వారిగా రిక్రూట్‌మెంట్ చేపట్టాలా అన్నదానిపై ప్రభుత్వంలోగాని, టిఎస్‌పిఎస్‌సి వద్దగాని స్పష్టత కొరవడింది. దీంతో న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో శాఖల వారిగా వేలాదిగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడి పరిపాలన సైతం దెబ్బతింటుంది. జోనల్ సిస్టమ్ విధానం అధిగమించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్ పాటించాలా లేక రాష్టప్రతి ఉత్తర్వులు సవరించుకోవాలా అన్నదానిపై ప్రభుత్వ వైఖరి తేల్చుకోవాలి. ఉద్యోగాల భర్తీపై కేలండర్ విధానాన్ని అనుసరించడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పద్ధతి పాటించడం ద్వారా రిక్రూట్‌మెంట్ సమస్యలను అధిగమించవచ్చు. పరీక్షలు నిర్వహించాక ఫలితాలు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉండటం నిరుద్యోగుల్లో అసహనాన్ని రేకెత్తిస్తుంది. ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియ సమస్యలపై స్పష్టమైన విధానాలు రూపొందించుకోవాల్సివుంది.

- మందడి ఉపేందర్‌రెడ్డి టిఎన్‌జివోస్ రాష్ట్ర అసొసియేట్ అధ్యక్షుడు