ఫోకస్

సీఎం మాటలు నీటి మూటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాళీగా ఉన్న లక్షా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన నిరుద్యోగులను, విద్యార్థులను ఉత్సాహపరిచింది. కానీ కెసిఆర్ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. మా ఉద్యోగాలు మాకు కావాలన్న నినాదంతో నిరుద్యోగులు, విద్యార్థులూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఉపాధ్యాయల ఉద్యోగాల భర్తీకి అరకొర చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని వేలసంఖ్యలో ఖాళీలను భర్తీ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏయే ఖాళీలను భర్తీ చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? శే్వతపత్రం విడుదల చేయాలి. ఖాళీల భర్తీలో ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమిటో తెలియజేయాలి. జోనల్ వ్యవస్థపై వెంటనే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. జోనల్ వ్యవస్థను కొనసాగించడం అవసరమా అని వ్యాఖ్యానించి, చివరకు జోన్ల సంఖ్యను పెంచాలనుకుంటున్నట్లు ప్రకటించడం విస్మయం కలిగించింది. రాష్టప్రతి ఉత్తర్వులు అవసరమో లేదో ప్రభుత్వమే స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్రంలో రెండే జోన్లు ఉండాలి. ఒకటి రాష్టస్థ్రాయి, రెండోది జిల్లాస్థాయి. ఈ రెండు జోన్లకు తగ్గట్టుగా ఖాళీలను నిర్ణయించి, నియామకాలు చేపడితే స్థానికంగా జిల్లాల వారీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా కొనసాగిస్తున్నప్పటికీ, జిల్లాల్లో స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తే రాజధానికి వలసలు రావడాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు కనె్నర్ర చేయక ముందే ప్రభుత్వం మేల్కొని ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలి.

- కనుకుల జనార్థన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, టి.పిసిసి సేవాదళ్ విభాగం చైర్మన్