ఫోకస్

వర్సిటీల వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో రిసెర్చ్‌స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు పూర్తి బాధ్యత వహించాల్సింది వైస్ చాన్స్‌లరే. తన వైఫల్యాన్ని మరి ఎవరి మీదనో వేసి తప్పించుకోలేరు. గతంలో కూడా ఇదే యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య వంటి ఉదంతాలు చాలా చోటుచేసుకుంది. ఆ సంఘటన జరిగినప్పుడే యూనివర్సిటీ యాజమాన్యం సరిగా స్పందించి ఉంటే ఇప్పుడు రోహిత్ ఉదంతం జరిగి ఉండేది కాదు. యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడం వల్లనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. విశ్వవిద్యాలయంలో జరిగిన ఉదంతాన్ని కులంతో ముడిపడిన సమస్య కానే కాదు. కులం అనేది సమాజంలో అంతర్భాగమే. దానిని ఒక సమస్యగా చూడటం తప్పు. యూనివర్సిటీలో విద్యార్థులకు రాజకీయ భావాలు ఉండకూడదన్న దృక్పథం తప్పు. రాజకీయ భావాలు లేకుండా ఉండటానికి యూనివర్సిటీ ప్రాథమిక పాఠశాల కాదు. రాజకీయ భావాలు కలిగి ఉండటం తప్పుకాదు. పాలక పార్టీలకు, రాజకీయ పార్టీలు తమ భావజాలం, తమ రాజకీయ కోణం మాత్రమే యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఉండాలను కోవడం తప్పు. హెచ్‌సియులో విద్యార్థులకు, వారి అసోసియేషన్లకు మధ్య ఏదైనా సమస్యలున్నా, గొడవలు ఉన్నా వాటిని యూనివర్సిటీ యాజమాన్యం సత్వరం పరిష్కరించాలి. ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదు. అయితే యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరాని జోక్యం చేసుకోవడం వల్లే రోహిత్ ఆత్మహత్యకు కారణమైందన్నది తమదే కాదు, విద్యార్థులందరి అభిప్రాయం.

- గెల్లు శ్రీనివాస్, అధ్యక్షుడు, టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ