ఫోకస్

ముంచుకొస్తున్న కాలుష్యం ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగరాలకే పరిమితమైన కాలుష్య ముప్పు ఇపుడు నెమ్మదిగా నగరాలకు, పట్టణాలకు సోకింది. ప్రతి ఊర్లో ఏదో ఒక రకమైన కాలుష్యం బెడద పెరిగింది. గ్రామాలకు జల కాలుష్యం, పట్టణాలకు రసాయన కాలుష్యం, మహానగరాలకు ధ్వని కాలుష్యం, కాంతిశక్తి కాలుష్యం పట్టుకున్నాయి. ఇపుడు అంతా వాయు కాలుష్యంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా, ధ్వని కాలుష్యం కూడా ఏమంత తక్కువగా లేదు. వాయు కాలుష్యం సమస్య దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికే పరిమితమైంది కాదు. అనేక నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని స్వయంగా సుప్రీం కోర్టే వ్యాఖ్యానించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలు, జాగ్రత్తలు యావత్‌దేశాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా రూపొందించాలని కూడా కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి అవసరమైన దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలని పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థలకు సూచించింది. సుప్రీం కోర్టు నియమించిన ఈడీసిఏ అంతకుముందు న్యాయస్థానానికి ఢిల్లీలో తలెత్తిన సంక్షోభంపై నివేదిక ఇచ్చింది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దీర్ఘకాలిక సమగ్రత ఉండాలనేది సుప్రీం కోర్టు భావన. మరోపక్క ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్రంతోపాటు హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాలకు కూడా సుప్రీం కోర్టు తాఖీదులిచ్చింది. వాహనాల పొగతోపాటు పంటలను దగ్ధం చేయడంవల్ల వస్తున్న మసి, ధూళి రేణువుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కూడా ఆదేశించింది. శాస్తజ్ఞ్రుల లెక్కల ప్రకారం మనిషి రోజూ 25 శాతం మేర నీరు, ఆహారాన్ని తీసుకుంటే 75 శాతం గాలినే పీలుస్తాడు. రోజుకు 22వేల సార్లు గాలి పీలుస్తాడు. ఈ లెక్కన రోజూ 15-17 కిలోగ్రాముల గాలిని స్వీకరిస్తాడు. గాలిలో ఏ విధమైన భౌతిక , రసాయనిక తదితరాల ప్రభావంతో మనిషి జీవనాన్ని రోగమయం చేస్తోంది. ఆహారం, నీరు లేకున్నా కేవలం గాలితో బతికే అవకాశం కూడా కొంతకాలం ఉంటుందనే సత్యాన్ని మరిచిపోరాదు. ఢిల్లీ, బీజింగ్ నగరాలను చూస్తే రెండింటి జనాభా, వాహనాల సంఖ్య, వైశాల్యం దాదాపు సమానం. సరి-బేసి ఫార్ములా బీజింగ్‌లో 2008 ఒలింపిక్స్ సమయంలో అమలుచేశారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించారు. సరి-బేసి పద్ధతి మెక్సికోలో 1984లో మొదలై 1993 వరకూ కొనసాగింది. ఈ నిర్ణయంవల్ల 11 శాతం మేర కాలుష్యం తగ్గిందని తేలింది. ఆ తర్వాత వాహనాల సంఖ్య పెరిగిపోయింది. లండన్, పారిస్‌లలో కూడా ఈ విధానం అమలుచేసి చూశారు. ఢిల్లీలో జనాభా కోటీ 70 లక్షలు, వాహనాల సంఖ్య కోటి వరకూ ఉంది. ఇతర ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి అనునిత్యం వచ్చే వాహనాలు అదనం. సరి-బేసి సంఖ్యల విధానం చేపట్టిన తర్వాత అక్కడ వాహనాల సంఖ్య కూడా పెరిగాయని తెలుస్తోంది. దాంతో ఈ మొత్తం వ్యవహారంపై లోతైన అధ్యయనం జరగాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని న్యాయస్థానాలు సూచిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్, విశాఖపట్టణంలలో కాలుష్యం తక్కువేమీ కాదు. ప్రమాణాలను మించి అనునిత్యం కాలుష్యం నమోదవుతోంది. ఈ కాలుష్య కోరల్లోంచి ఎలా బయటపడాలనేదే ఈ వారం ఫోకస్.