ఫోకస్

సత్సంబంధాలుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడు అలజడులు, ఉద్యమాలు చోటుచేసుకోవడం సర్వసాధారణంగా మారింది. విద్యార్థులు చదువు వైపు కాకుండా ఇతర మార్గాల వైపు దృష్టి సారించడమే ఇందుకు ప్రధాన కారణం. అందువల్ల వారు నిరంతరం పుస్తకాలతో కాలక్షేపం చేసేలా వారిని మోటివేట్ చేయాలి. విద్యార్థులు పేపర్ ప్రెజంటేషన్ సెమినార్ హాల్లో లేదా కానె్ఫరెన్స్ హాల్లో ఇవ్వడం అలవాటు చేయగలిగితే వారు అందుకోసం నెలల తరబడి కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల వారు ఎక్కువ సమయం లైబ్రరీలోను లేదా పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. అలాగే కేరీర్ డెవలప్‌మెంట్‌పై కూడా విద్యార్థులకు మోటివేట్ చేయాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఏం చేయాలనే ప్రశ్న వారిలో రగల్చాలి. ఉపాధి కోసం సక్రమంగా విద్యను నేర్చుకుంటే వారు ఇతర మార్గాల వైపు దృష్టిసారించరు. అలాంటపుడు ఉద్యమాలకు ఆస్కారం ఉండదు. మరోపక్క వైస్ ఛాన్సలర్లు కూడా నిజాయితీగా ఉంటే ఎలాంటి విమర్శలకు తావుండదు. వైస్ ఛాన్సలర్ అంటే విద్యార్థులకు గౌరవం ఉండాలే తప్ప, భయం ఉండరాదు. విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా వారు నేరుగా వైస్ ఛాన్సలర్‌తో సంప్రదించే పరిస్థితి నెలకొనాలి. వైస్ ఛాన్సలర్లు కూడా ఆయా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి. అంతేగాని విద్యార్థులపై పగ పెంచుకునేలా వ్యవహరించరాదు. విద్యార్థులకు, వైస్ ఛాన్సలర్‌కు మధ్య అనుబంధం ఉండాలి. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు అవసరమైన వాతావరణాన్ని విశ్వవిద్యాలయాల్లో కల్పించాలి. దానివల్ల విద్యార్థులు ఎక్కువ సమయం పుస్తకాలతో గడపడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు ఎప్పటికపుడు అసైన్‌మెంట్లు, హోం వర్కులు ఇవ్వడం వల్ల వారు ఎక్కువ సేపు పుస్తకాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. మరోపక్క అలజడులు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా దానిపై విసి ధైర్యంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న వారు ఉండాలి.

- ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు వైస్ ఛాన్సలర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం