ఫోకస్

అభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రాన్ని కోరటం ముదావహం. పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావాలనే సదుద్ధేశ్యంతో ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లాల పునర్విభజన ద్వారా 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసారు. తాజాగా గిరిజన తండాలను, చెంచుపెంటలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇదంతా పరిపాలన ప్రజల వద్దకు చేర్చటమే. ప్రస్తుతం జిల్లాలను పునర్విభజించటంవల్ల ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లాలో, మరికొన్ని నియోజకవర్గాలు మరో జిల్లాలోకి వెళ్లాయి. అదేవిధంగా మండలాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవద్దనే ఉద్ధేశ్యంతో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, లోక్‌సభ నియోజకవర్గాల పెంపును ముఖ్యమంత్రి కోరుతున్నారు. నియోజకవర్గాల సంఖ్యను పెంచటంవల్ల కేంద్రంనుంచి వివిధ పథకాలద్వారా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కేంద్రం ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

- పసునూరి దయాకర్ వరంగల్ పార్లమెంటు సభ్యుడు