ఫోకస్

విభజనతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఎన్నుకుని పాలన పగ్గాలను అప్పగించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల విభజన తప్పనిసరి. పార్లమెంటు నియోజకవర్గాలను విభజన చేయాలన్నా, సంఖ్యను పెంచాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. పార్లమెంటు స్థానాలతోపాటుగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు బిల్లును ప్రవేశపెడితే సభ్యులంతా ఆమోదించాల్సి ఉంటుంది. గతంలో పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు మెజార్టీ శాతం గ్రామాల్లో పర్యటించకపోగా పదవీకాలం ముగిసినా ఎన్నుకున్న ఎంపీని కనులారా చూసిన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధులను దగ్గరగా చూసి తమ సమస్యలను ఏకరువు పెట్టుకోవాలనే ఆశలతో నేటి సమాజం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం, ఎన్నికల ప్రచార సమయం తక్కువగా ఉండటంవల్ల ఓటర్ల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గాలను చిన్నవిగా విభజించడం వల్ల నిధులు కూడా ఎక్కువగా సమాకూరుతాయి. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది. కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఎంపీ నియోజకవర్గానికి రెండు చొప్పున కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, మొత్తం 154 అసెంబ్లీ స్థానాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. పార్లమెంటు స్థానాలను విభజించి సంఖ్యను పెంచడంవల్ల ప్రజల వద్దకు పాలన, అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరడం తథ్యం.

- చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ