ఫోకస్

విభజన రాజ్యాంగ హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్టికల్ 82 ప్రకారం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన విధానాన్ని అమలు చేయడం మంచి ఆలోచనే! పార్లమెంట్ యువ సభ్యునిగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరగాలంటూ ఆశిస్తున్నాను. నాలాంటి యువ ఎంపీలంతా ఇదే కోరుకుంటున్నారు. జనాభా మార్పులతో లోక్‌సభ నియోజకవర్గాలను విభజించే విధానంవల్ల భౌగోళికంగా ఎంతో పెద్దదిగా ఉన్న సిగ్మెంట్లు పరిధి తగ్గడంవల్ల ప్రతీ ఓటరు సమస్యను పార్లమెంటు సభ్యుడు వినిపించుకుని, వినతులు తీసుకుని, పరిష్కరించేందుకు అస్కారం ఎక్కువగా ఉంటోంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే 1000 పంచాయతీలు, 4000 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పదవీకాలం మొత్తం నియోజకవర్గంలో ఉన్నా ప్రజలను అందరినీ కలిసి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండదు. అలాగే, అరకు పార్లమెంటు నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో ఉంటోంది. అక్కడ ఓటువేసిన తన ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితులు ఎన్నో. ప్రజలకు అందుబాటులో ఉండలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ శాతం పార్లమెంటు సభ్యులకు ఉంది. రాజకీయంగా ఈ విభజన ఉండకూడదనేది యువతరం పార్లమెంటు సభ్యుల ఆలోచన. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి సమాన జనాభా కలిగి ఉండాలి. నైతిక విలువలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేస్తేగానీ, ఈ విభజన ప్రజాప్రయోజనాల దృష్యా నిర్వహించలేరు. లోక్‌సభ విభజన అయితే తప్పనిసరిగా రానున్న తరాలకు చాలా అవసరం. 543 పార్లమెంటు నియోజకవర్గాలకు 130 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే మాలాంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంచనా వేయవచ్చు. అటువంటి కేంద్ర పథకాలు ప్రజలకు వెంటవెంటనే చేరుకోవాలంటే - విభజన అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు నియోజకవర్గం అంతా వినతులు కూడా పూర్తిగా పరిష్కరించలేము. అదే విభజన జరిగి, భౌగోళిక సరిహద్దులు, భవిష్యత్తు రాజకీయాలకు ఓటుబ్యాంకు సర్దుబాట్లు కాకుండా, ప్రతీ ఒక్కరూ తమ సమస్యలు ప్రజాప్రనిధులకు చెప్పుకునే అవకాశం కల్పించేది విభజన ప్రక్రియ మాత్రమే. నియోజకవర్గాల విభజనవల్ల తక్కువ జనాభా, భౌగోళిక సరిహద్దులవల్ల ఓటు హక్కు వినియోగంపై మక్కువతోపాటు, ప్రశ్నించేందుకు ప్రజాప్రతినిధులు చాలా దగ్గరగా అందుబాటులో ఉండే అవకాశం విభజన విధానం కల్పిస్తుంది. అందుకే - యువతరం ఎంపీలంతా పార్లమెంటు నియోజకవర్గాల విభజన కావాలంటూ ఖచ్చితంగా సుస్పష్టం చేస్తున్నాం. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల కమిషన్ పట్ల ఎటువంటి నమ్మకం ఉందో, అటువంటి నమ్మకం కలిగే నైతిక విలువలతో పనిచేసే డిలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయగలిగితేనే ఈ విభజన ప్రక్రియ భవిష్యత్తు తరాలకు మంచి ఫలితాలు ఇవ్వగలదు. ఈ కమిటీపై ఎటువంటి ఒత్తిడికి లొంగదనే భావన కమిటీ సభ్యులకు కలిగించే భరోసా కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది.

- కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీ, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం