ఫోకస్

నకిలీల సంగతి మాట్లాడరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో ఎవరు ఆత్మహత్యకు పాల్పడినా, అది విషాదమే, రోహిత్ ఆత్మహత్య సైతం విషాద ఘట్టమే.. దానికి ఎవరైనా బాధపడాల్సిందే.. అయితే దాని కొనసాగింపుగా జరుగుతున్న సంఘటనలు మరింత బాధాకరం. వివేకవంతులెవరూ ఆత్మహత్య చేసుకోరు. రోహిత్ ఆత్మహత్యకు ముందు తను రాసిన సూసైడ్ లేఖలోనే ఎవరికీ బాధ్యత లేదని స్పష్టం చేసిన తర్వాత కూడా కొంత మందిపై లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. తాము వడ్డెర కులస్థులమేనని, తాము ఎస్సీ కాదని రోహిత్ తండ్రి స్పష్టం చేయడమేగాక, తన భార్య ఎస్సీ అని ఎందుకు చెబుతోందో తెలియడం లేదని ఆయన చెప్పిన వీడియోలు పత్రికల వెబ్‌సైట్లలో ఉన్నాయి. తాను విడాకులు తీసుకున్నా రోహిత్ తల్లితో కలిసే ఉంటున్నానని ఆయన చెబుతున్నారు. అంటే స్వయంగా రోహిత్ తండ్రే తాము ఎస్సీ కాదని చెబుతుంటే ఇంతకాలం ఎస్సీ సర్ట్ఫికేట్‌తో చదవడం తప్పుకాదా? దానిపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరు? రిజర్వేషన్లతోనే ఇంతవరకూ వచ్చాడు కదా... ఈ మధ్య రోహిత్ మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి, వాటిని అందరూ చూస్తున్నారు, ఎందుకు స్పందించడం లేదు? ఎస్సీ కులానికి చెందని వ్యక్తి ఎస్సీ అని చెబుతుంటే ఎవరూ మాట్లాడటం లేదు, అదే తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని స్పష్టం చేసిన తర్వాత కూడా మంత్రిపైనా, విసిపైనా చర్యలు తీసుకోమని కోరడం ఏమిటి? ఇక్కడ నా ఇంటెన్షన్ కులం గురించి మాత్రమే కాదు, ప్రవర్తన, చదువులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలతో అట్టుడికిపోతుండటం దానిని కొన్ని వర్గాలు అలుసుగా తీసుకుని తమ స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూడటం సరికాదు. దానికి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, నాయకులు సైతం వత్తాసు పలకడం ఏమిటి? ఎంతో మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఇష్యూ చేయని వారు, ఇపుడు రోహిత్ విషయం మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు? సమాజం కొన్ని విషయాలపై ఎందుకింత వివక్ష చూపుతోంది? రోహిత్ ఘటనను ఒక సంఘటనగా చూడండి, హిందూత్వం గురించి ఆయనకు ఎందుకింత వ్యతిరేకత? ప్రతి రోజు అగ్రవర్ణాల ప్రస్తావన ఎక్కువగా చేస్తున్నారు.. పేదవారైనా అగ్రవర్ణాల పరిస్థితి ఏమిటి? వీరికి వంద మార్కులు వచ్చినా, సీట్లు రావడం లేదు, నిమ్న వర్గాల పేరుతో సున్నా మార్కులు వచ్చినా సీట్లు వస్తున్నాయి. సమాజంలో సమతుల్యత ఎక్కడ ఉంది? అగ్రవర్ణాలపై ఎంతకాలం ఈ వివక్ష?

- శారద దొడ్డపనేని రచయిత్రి, హైదరాబాద్