ఫోకస్

నియోజకవర్గాల్ని విభజించాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1970 వరకూ పార్లమెంటుకు, అసెంబ్లీకి కలిసి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1971 నుండి విడివిడిగా ఎన్నికలు జరుపుతున్నారు. ఇలా విడదీయడానికి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి కారణాలను చూపలేదు. 1952లో జరిగిన ఎన్నికల్లో 51 పార్టీలు పోటీ చేయగా, 21 పార్టీలు పార్లమెంటులో ప్రవేశించాయి. 1962 వరకూ లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 494 మాత్రమే, 1967లో ఈ సంఖ్య 525కు పెరిగింది. 1971లో జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ స్థానాలను 545కు పెంచారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్లమెంటు అసెంబ్లీ స్థానాల సంఖ్య 2026 వరకూ ఇక మార్చడానికి వీలులేదని తీర్మానించారు. వాటి కాలపరిమితి ఆరేళ్లు చేశారు. 1977లో జనతా ప్రభుత్వం లోక్‌సభ, అసెంబ్లీ కాలపరిమితి 43వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐదేళ్లకు తగ్గించింది. కాని నియోజకవర్గాల పునర్విభజన జోలికి పోలేదు. 1971లో 5 నుండి 7.5 లక్షల జనాభాతో లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని 324-329 ప్రకరణలు ఎన్నికల యంత్రాంగం గురించి చెబుతున్నాయి. వాటి ప్రకారం ఆరు లక్షల జనాభాకు ఒక లోక్‌సభ స్థానాన్ని కేటాయించాలి. పదేళ్లకోమారు జనాభా లెక్కలు సేకరించి దాని ఆధారంగా ఆ సంఖ్య పెరుగుతూ ఉండాలి. లోక్‌సభ , అసెంబ్లీ స్థానాలను పెరిగిన జనాభాకు అనుగుణంగా పునర్విభజించాలని బిజెపి సహా అనేక పార్టీలు ఎంతోకాలం నుండి కోరుతున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. నేషనల్ ఫ్రంట్ పాలనలో దినేష్ గోస్వామి ఎన్నికల సంస్కరణల రిపోర్టులో ఈ విషయం పేర్కొన్నారు. ఆ పని జరగక ముందే పలు ప్రభుత్వాలు కుప్పకూలాయి. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఒక్కో లోక్‌సభ సభ్యుడు 16 నుండి 20 లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉంటున్నారు. జనాభా పెరిగిన కొద్దీ వారి అవసరాలకు అనుగుణమైన నిష్పత్తిలో రాజకీయ ప్రతినిధులు కూడా పెరగాలి. తెలంగాణలో మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 31 లక్షలకు పైమాటే. ఈ లెక్కలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ సభ్యులు 89 మంది ఉండాలి. కాని ప్రస్తుతం వారి సంఖ్య 42 మాత్రమే. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 543 నియోజకవర్గాలుండగా, ఆ సంఖ్య 1142కు పెరగాలి. ప్రజల వాణిని వినిపించడానికి, వారి అవసరాలను ఏకరవు పెట్టడానికి, ఆయా ప్రాంతాల అభివృద్ధి పనులను సాధించడానికి, ఈ ప్రజాప్రతినిధులు చాలా అవసరం. వీళ్లు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే జనాభా ప్రతినిధులు నిష్పత్తిని ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం ఎపీ, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపు రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి ఉంటుంది. 2026 తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సర్దుబాటు ఉండాలని ఆ అధికరణ సూచిస్తోంది. జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చ జరిగినపుడు కూడా రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం 2026 తర్వాత తొలి జనాభా లెక్కలు ప్రకటించేంత వరకూ పార్లమెంటు నియోజకవర్గాలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వర్గీకరణకు అంత వరకూ ఆగాల్సిందేనా, ముందుగా చేసుకోవడానికి వీలులేదా అనే అంశంపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.