ఫోకస్

టీఆర్‌ఎస్ పాలనలో అర్థమే మారిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత అర్థమే మారిపోయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని విస్మరించింది. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల ఆర్థిక స్వావలంబనకోసం డ్వాక్రాలతోపాటు అనేక కార్యక్రమాలతో కొంత పురోగతి సాధించాయి. ప్రతిభా భారతి వంటి వారిని ఎన్టీఆర్ స్పీకర్‌గా చేయడంతోపాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి కూడా లేకుండానే మహిళల గురించి మాట్లాడే నేతలు అధికమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో వేదికపై ఒక్క మహిళకు కూడా రాష్ట్రంనుంచి చోటు దక్కలేదు. దీనిపై కొందరు మీడియా ప్రతినిధులు అడిగితే సామర్థ్యం ఉన్న మహిళా నేతలు లేరని కేటీఆర్ చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. మహిళా సమస్యలు చెప్పుకునేందుకు ప్రభుత్వంలో మహిళా నేతలే లేకపోగా, మహిళలను కించపరచేలా మాట్లాడే మంత్రులే మహిళల గురించి ఏదో చేస్తున్నామని చెబుతుండటం బాధ కలిగిస్తోంది. మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నా చర్యలు లేవు. కేవలం స్వప్రయోజనాలకోసం కేసీఆర్ తన కూతురు కవితను ముందుపెడుతూ కాలం గడుపుతున్నారు. మూడున్నరేళ్ళ టీఆర్‌ఎస్ పాలనలో మహిళా సాధికారత అంశమే మరుగున పడిపోయింది. మహిళలను చులకనగా చూసే నేతలే మహిళా సాధికారత సాధిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారు కానీ కనీస గుర్తింపు ఇవ్వడం లేదు. కనీసం వారి ఎదుగుదలకు అవసరమైన అవకాశాలను కూడా ఇవ్వకపోవడం దారుణం. మహిళా ఆర్థిక పరిస్థితి, మహిళల సమస్యలపై ఇటీవల జరిగిన ప్రపంచ సదస్సులో కేటీఆర్ అనుసంధానకర్తగా వ్యవహరించడం మహిళలపట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తోంది.
- మద్దినేని బేబీ స్వర్ణకుమారి టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు