ఫోకస్

చదువులపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో అనేకానేక విశ్వవిద్యాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి స్పష్టంగా ముచ్చటగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి. ఎంతో సంతృప్తికరంగానే జీతాలు పొందుతున్న ఆచార్యులు ‘బోధకులు’ పాఠాలు సక్రమంగా చెప్పకపోవటం... ఇక విద్యార్థులు ఇతరత్రా కార్యకలాపాల్లో మునిగి తేలుతూ తరగతులకు సక్రమంగా హాజరుకాకపోవటం.. ఈ రెండు కారణాలతో అకడమిక్ క్యాలెండర్‌కు అర్థమే లేకుండా పోతున్నది. విద్యార్థులు విధిగా తరగతులకు హాజరయ్యేలా బయోమెట్రిక్ విధానాన్ని సమర్ధవంతంగా నిర్వహించాల్సి వుంది. నిర్దేశిత హాజరు లేకపోతే తమ భవిష్యత్ దెబ్బతింటుందనే భయాన్ని వారిలో కల్పించాలి. అలాగే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అధ్యాపకులు నిర్దేశిత కాలంలో సిలబస్‌ను పూర్తిచేస్తూ సకాలంలో పరీక్షలు జరిగేలా చూడాలి. ఇక అన్నింటికీమించి బోధకులు తమ విద్యార్థులను పరిశోధనల వైపు దృష్టి మళ్లింపచేయాలి. అసలు అత్యధిక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత కన్పించడం లేదు. ఇందుకోసం తగినన్ని పరిశోధనాలయాలు, ఇతర వౌళిక సదుపాయాలు కల్పించాల్సి వుంది. అవసరమైతే అదనపు నిధులను కేటాయించాలి. మరో విశేషం ఏమిటంటే కేంద్రం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ నిధులు జీతాలకే సరిపోని స్థితి. ఇక పరిశోధనలకు ఎక్కడ తావుంటుంది. 2008 తర్వాత జిల్లాకో విశ్వవిద్యాలయం చొప్పున ఏర్పాటు కావటం సంతోషకరమే. అయితే నిబంధనలకు తగ్గట్లు 12బి ప్రకారం వౌళిక సదుపాయాలు లేవంటూ కొత్తవాటికి నిధులు ఇవ్వటానికి యుజిసి వెనుకంజ వేస్తున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విశ్వవిద్యాలయంలో కనీసం రూ.20 కోట్లు కేటాయించి తక్షణం వౌళిక సదుపాయాలు కల్పించాల్సి వుంది. అప్పుడే విశ్వవిద్యాలయాల్లో ప్రశాంతత నెలకొనటమే గాక చదువులు వర్ధిల్లుతాయి.

- ప్రొ. కోదాటి వియ్యన్నరావు మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం