ఫోకస్

తెలంగాణలో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా సాధికారికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళాభివృద్ధిని కాంక్షిస్తు అమలుచేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాల ఫలితంగా అన్ని రంగాల్లో సాధికారికత దిశగా పురోగమిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలను అమలుచేస్తూనే టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే మహిళలకు సబ్సిడీలు కల్పిస్తు ప్రొత్సహిస్తుంది. మహిళా ఇండస్ట్రీయల్ పార్కులను రూపకల్పన చేసింది. కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, ఉపాధి కల్పన చర్యలతో మహిళార్ధికాభివృద్దికి కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇటీవల పారిశ్రామికరంగంలో మహిళాభ్యున్నతి లక్ష్యంగా హైద్రాబాద్‌లో జిఈఎస్ సదస్సును విజయవంతంగా నిర్వహించింది. రాజకీయంగా మహిళా సాధికారికత, మహిళాభివృద్ధి దిశగా సీఎం కెసిఆర్ ప్రభుత్వం దేశంలోనే అతికొద్ధి రాష్ట్రాల బాటలో స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తు పరిపాలనలో మహిళాను సగభాగం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో లేని రీతిలో నామినేటెడ్ పదవుల్లోనూ రిజర్వేషన్లను అమలు చేశారు. చట్టాల రూపకల్పనలో మహిళా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసే క్రమంలో రెవెన్యూ రికార్డు శుద్ధీకరణ, పంచాయితీరాజ్ నూతన చట్ట రూపకల్పన, ఎస్సీ, ఎస్టీ పథకాల సమీక్షలో తనతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సహా ఇతర మహిళా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలను కెసిఆర్ భాగస్వామ్యం చేశారు. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతినిస్తున్నాం. సామాజికంగా మహిళాభ్యున్నతికి సైతం తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుండి కెసిఆర్ కిట్ పథకం మొదలుకుని ఆరోగ్యలక్ష్మి, బాలికల గురుకుల పాఠశాలల, కళాశాల ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో బాసటనిస్తుంది. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీటి నల్లాతో మహిళలకు ఇక్కట్లను దూరం చేస్తుంది. ఒంటరి మహిళలకు పింఛన్ వసతి అమలవుతుంది.
- గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్