ఫోకస్

వినూత్న కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతకోసం ఎనలేని కృషి చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా పొదుపు గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక బలోపేతానికి శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల మహిళలకు పూర్తి అవగాహన కల్పించి, అవి వారికి ఉపయోగపడేలా చేసేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రతి 35 ఇళ్లకు ఒక మహిళను ఎంపిక చేసి ఆమెకు శిక్షణనివ్వడం ద్వారా మహిళలకు ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమాలపై స్థానిక మహిళల్లో అవగాహన పెంచే చర్యలు తీసుకుంటున్నాం. నెల్లూరు నగరంలో ఒక పొదుపు మహిళా బ్యాంక్ నుండి రూ.50లక్షల మేర రుణం తీసుకొని ఒక పెద్ద రెస్టారెంట్ ఏర్పాటు చేయడమే రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తోంది. అయితే మహిళలు ఉన్నత స్థితికి చేరుకునేందుకు, ఆర్థిక, సామాజిక ప్రగతి సాధించేందుకు విద్య అవసరమనే విషయాన్ని గుర్తించి విద్యావంతులుగా మారాల్సిన అవసరం ఉంది. ఇటీవల అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరీయన్ల సదస్సులో చేసిన తీర్మానాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు సదస్సులో మరో 10 ముఖ్యమైన తీర్మానాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలు కుటుంబాల బాధ్యతలను నిర్వర్తించడంతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించినపుడే ఆ రాష్ట్ర ప్రగతి పుంజుకుంటుందని ఎన్నో సందర్భాల్లో పేర్కొనడమే కాకుండా ఆ దిశగా మహిళా సాధికారత సాధించేందుకు రూపొందిస్తున్న పథకాల వలన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలు మరోసారి దేశానికే మార్గదర్శకంగా మారుతారనేది స్పష్టం.
- తాళ్లపాక అనూరాధ, టీడీపీ ఏపీ ఉపాధ్యక్షురాలు