ఫోకస్

సిద్ధాంతాల ఘర్షణ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల్లో ఆలోచనల పరమైన ఘర్షణ ఉండవచ్చు, కానీ భౌతిక దాడులు ఉండకూడదు. అలా ఉంటే ఏ విశ్వవిద్యాలయం కూడా మనుగడ సాగించలేదు. విశ్వవిద్యాలయాల్లో అన్ని సిద్ధాంతాలు, భావాల మధ్య స్వేచ్ఛగా చర్చ జరుపుకునే వాతావరణం ఉండాలి. విశ్వవిద్యాలయాల్లోకి వచ్చే పేద, దళిత విద్యార్థులు ఒకవైపు, కాస్త సంపన్నులు, ఆగ్రవర్ణం విద్యార్థులు ఒకవైపు ఉంటారు. వీరంతా స్నేహపూర్వకంగా సామరస్యంగా తమ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగాలి. అలా వ్యక్తం చేయగలిగే ఒక మెకానిజం యూనివర్సిటీల్లో ఉండాలి. కానీ అలా లేకపోవడమే లోపం. అధ్యాపకులు సైతం ఇలాంటి అంశాలపై దృష్టిపెట్టాలి. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి నాక్ గుర్తింపు ఉంది. దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంగా గుర్తింపు ఉంది. ఇక్కడ 90 శాతం వరకు విద్యార్థులు తరగతులకు హాజరవుతారు, తరగతులు జరుగుతాయి. మిగిలిన విశ్వవిద్యాలయాల కన్నా ఇక్కడ ప్రొఫెసర్లు సైతం తరగతులు బోధించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇవి ప్రతిష్టాత్మకమైనవి, మెరుగైన విద్యా సంస్థలు. ప్రొఫెసర్లు జ్ఞానాన్ని బోధించడంతోపాటు సమాజానికి సంబంధించి చైతన్యం కలిగించాలి. తమపై ఉపాధ్యాయులు శ్రద్ధ పెడతారని విద్యార్థులు భావిస్తారు. స్కూల్ స్థాయిలో మార్కుల పోటీలు తప్ప సమాజం గురించి ఏ మాత్రం అవగాహన కలిగించడం లేదు మన చదువులు, ఇక ఇంటర్‌లోకి వచ్చిన తరువాత మార్కులు తప్ప మరో ప్రపంచమే ఉండదు. ఎంసెట్, ఇంజనీరింగ్, మెడిసిన్ అమెరికా వెళ్లడం ఇవే కలలు. సమాజం గురించి ఆలోచించేవారు, చెప్పేవారు పాఠశాల స్థాయిలో లేరు. ఇంటర్ మీడియట్ స్థాయిలో అసలే లేదు. ఉన్నత వర్గాలు, ఆగ్రవర్ణాలు, పేదలు, దళితులు అనే తేడా లేకుండా విశ్వవిద్యాలయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. బిజెపి భావజాలం కల విద్యార్థి సంఘాలు మేం అధికారంలో ఉన్నాం అనే భావనతో ఉంటున్నారు. మేం చెప్పిందే వినాలు, మా భావజాలమే గొప్పది అనే భావన వారిలో కనిపిస్తోంది. దేశంలో నెలకొన్న అసహనం, ఇతరుల భావాలను గౌరవించలేని వైఖరి వల్ల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య సంఘటన జరిగింది. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల్లో ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉండేందుకు అందరూ కృషి చేయాలి. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఉండగా ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశాను. అమ్మాయిలు స్వేచ్ఛగా చదువుకోవడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీరే సూచించండి అంటూ విద్యార్థులను కోరాను.

- ప్రొఫెసర్ హర గోపాల్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్