ఫోకస్

సచివాలయం నుంచే మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాధినేతల్లో చిత్తశుద్ధి లోపంవల్లే అధికార భాషగా తెలుగు అమలుకు నోచుకోవడంలేదు. మార్పు సచివాలయం నుంచే రావాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో కొనసాగిస్తే పాలనా సౌలభ్యం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయాని కొస్తే 7వ తరగతి వరకు బోధనా మాద్యంగా తెలుగును ప్రవేశపెట్టాలి. మాతృభాష సంస్కారాన్ని నేర్పితే.. పరభాష మానసిక బానిసత్వాన్ని కల్పిస్తుంది. వృత్తి విద్యా కోర్సులలో కూడా తెలుగును ముఖ్యాంశంగా చేర్చాలి. దీనివల్ల విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేవారు సైతం మాతృభాష ప్రాశస్త్యానికి అలవాటుపడతారు. కాగా ఉపాధ్యాయుల ఎంపికలో కూడా ప్రమాణాలు పడిపోతున్నాయి. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో ఎంపిక నిర్వహిస్తున్నారు. ఫలితంగా విద్యాబోధనలో ప్రమాణాలకు పాతరేస్తున్నారు. వ్యాసరూప ప్రశ్నలు ఉండాలి. వ్యక్తీకరణ శక్తి ఆలోచనా వికాసాన్ని పెంపొదిస్తుంది. పాఠ్యాంశాలలో కూడా రాజకీయ జోక్యం పెరిగింది. ఈ కారణంగా కుల, మత, ప్రాంతీయ విభేదాలు రగులుకుంటున్నాయి. తర్కం, విశాల దృక్పథం కొరవడింది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు ప్రతి ఒక్కరూ మాతృభాష తప్పనిసరిగా నేర్చుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ఆంగ్ల మీడియంలో బోధన తప్పనిసరైనప్పటికీ జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథాలయశాఖలో తెలుగును పటిష్టంగా అమలు చేస్తున్నారు. మార్పు ప్రభుత్వ స్థాయి నుంచి రావాలి. తెలుగు వాచకాలతోనే అచ్చ తెలుగుకు బీజం పడుతుంది. ఓట్ల రాజకీయాలకు స్వస్తిచెప్తే మాతృభాషా పరిరక్షణ సాధ్యపడుతుంది.
- రావి రంగారావు అధ్యక్షులు, అమరావతి సాహితీ మిత్రులు