ఫోకస్

పాలన, బోధన తెలుగులోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. నేటికీ తెలుగుకు సరైన ఆదరణ లభించడం లేదు. ఆంగ్లం ప్రభావం ఉండటం వల్ల ప్రాధాన్యత తగ్గుతోంది. పరిపాలన, విద్యా బోధన తెలుగులోనే ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా తెలుగు మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగులోనే పాలన వ్యవహారాలు సాగాలని ఏకవాక్య ఆదేశాలు ఇచ్చారు. తెలుగులోనే అన్ని ఆదేశాలు ఉండాలని ఆయన చాలా తపన పడ్డారు. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తెలుగు అమలుపై శ్రద్ధ చూపలేదు. రాష్ట్ర పాలనలోనూ, బోధనలోనూ తెలుగు తప్పనిసరిగా ఉంటే తప్ప అమలు సాధ్యం కాదు. ముఖ్యంగా ఇంటిలో కూడా తెలుగు ఉంటే గానీ వంద శాతం అమలు జరగదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు స్థాయిలో కాకపోయినా, కనీసం కలెక్టర్ వంటివాడు తప్పనిసరిగా తెలుగువాడై ఉండాలని ఆశించాము. దీంతో తెలుగు భాషను సులభంగా అర్థం చేసుకోవడం వీలవుతుంది. రాష్ట్ర విభజనకు ముందు రాయుడు అనే కలెక్టర్ తెలుగు అమలుకు కృషి చేశారు. చాలామంది కలెక్టర్లకు ఆ పట్టుదల లేకపోవడంతో తెలుగు భాషకు దారితెన్నూ లేకుండాపోయింది. న్యాయం స్థానాల తీర్పులు కూడా తెలుగులో రావాల్సి ఉంది. సాంకేతిక పదజాలాన్ని, వృత్తి పరమైన పదజాలం తెలుగులో లేదని, శిక్షాస్కృతికి సంబంధించి పదాలు ఆంగ్లంలోనే ఉన్నాయని కారణం చూపి తెలుగుకు ప్రాధాన్యం తగ్గించింది. అధికారులకు తెలుగు రాకపోతే పాలన ఎలా సాధ్యం? ప్రజలు ఇచ్చే విన్నపాలు ఎలా చదవగలుగుతారు? ఒక్క పోలీసు శాఖ వారు మాత్రం తెలుగు అమలు చేస్తున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో సరిగా అమలుచేయడం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలుగులోనే సుమారుగా ఉంటోంది. రెవెన్యూలో అమలు మాటే లేకుండాపోయింది. తెలుగులో రాయడం చిన్నతనం అనే భావన, ఆంగ్లంలో రాయలేక పోవడంతోనూ ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది ఎమ్మెల్యేలకు తెలుగు అమలుపై ఇష్టం ఉంది. కొందరు శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించడం జరిగింది. తెలుగును పాఠశాలల్లో తప్పించడం తప్పు అని చెప్పారు. దీంతో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. తెలుగుపై ఆసక్తి ఉన్నా ప్రయివేటు పాఠశాలల్లో ఆంగ్లం విధిలేక చెబుతున్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి ఉపాధ్యాయ పోస్టులు ఆదర్శ పాఠశాలల్లో ఇవ్వడం లేదు. తెలుగు అధికార బాషా సంఘానికి సూచనలు చేయడం తప్ప, శిక్షించే అవకాశం లేదు. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
- డాక్టర్ జగర్లపూడి హేమచందర్ శాస్ర్తీ సంయోజకులు, తెలుగు భాషా వికాస ఉద్యమం, అనంతపురం