ఫోకస్

ప్రభుత్వాల ప్రోత్సాహం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే రాష్ట్రంలో తెలుగు భాషకు శాపంగా మారింది. నవ్యాంధ్రలో తెలుగు భాష అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సహేతుకం కాదు. ఎన్నికల ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలుగు భాషకు పూర్వవైభవం సహా పలు అంశాలను పేర్కొంది. అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడిచినప్పటికీ మేనిఫెస్టోలో తెలుగు భాషాభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చింది లేదు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషను బతికించుకోవాలంటే చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం కమిటీ నియమించింది. అప్పటి భాషాభివృద్ధి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరకాల ప్రభాకర్ తదితరులతో కూడిన కమిటీ ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పర్యటించింది. ఏళ్ల కాలయాపన అనంతరం నాలుగు నెలల కిందట కమిటీ నివేదిక ఇచ్చింది. అసలు తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషను బతికించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఇతర రాష్ట్రాలో పర్యటించి అధ్యయనం చేయడం ఏమిటో అర్ధం కాని ప్రశ్న. ఇటీవల విశాఖ కేంద్రంగా భాషాభిమానులంతా 29 రోజుల పాటు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టగా, బీజేపీ ఎమ్మెల్సీ శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో ప్రభుత్వం నిద్ర లేచింది. లేచిందే తడవుగా మూడు జీఓలు జారీ చేసి చేతులు దులుపుకుంది. ఒకటి నుంచి ఇంటర్ వరకూ తెలుగు భాషను తప్పనిసరి చేయాలని, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో సైతం తెలుగు భోధన జరగాలని, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ జీఓలు తప్పనిసరిగా తెలుగులోనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఇది కూడా కంటితుడుపు చర్య మాత్రమే. తెలుగు భాషను బతికించుకోవాలంటే భాషకు వనె్న తెచ్చిన ఎందరో మహానుభావుల చరిత్రలను ఇప్పటి తరాలకు వివరించాలి. తెలుగు సాహిత్యానికి గుర్తింపు తెచ్చిన శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ వంటి ప్రముఖుల ఇళ్లను స్మారకాలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటేనే తెలుగు భాషకు వైభవం, వనె్న సమకూరుతాయన్న వాస్తవాన్ని గుర్తిస్తే భాష ఉనికి మిగులుతుంది.
- పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రముఖ సాహితీవేత్త