ఫోకస్

తెలుగుకు బ్రహ్మోత్సవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషకు, సాహిత్యానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశంలో అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. దాదాపు 2500 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్నా, మూలానే్వషణకు సంతృప్తికర నిర్ణయాత్మక ఆధారాలు అందుబాటులో లేవు. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన గాథా సప్తశతి అన్న ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు కనిపించాయి. శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందే కృష్ణా, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని భావించారు. తెలుగు భాషకు మూల పురుషులు యానాదులు. తెలుగుభాష కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై లేదు. ప్రపంచం మొత్తం మీద 10 కోట్ల మందికి పైగానే తెలుగు మాట్లాడేవారున్నారు. అత్యధికంగా మాట్లాడే ప్రాంతీయ భాషల్లో తెలుగుదే అగ్రస్థానం, అలాగే ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో 13వ స్థానంలో ఉంది. తెలుగు భాష శతాబ్దాలుగా అనేక రూపాలను సంతరించుకుంది. తెలుగువారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, ఒడిశా, కర్నాటకలలో ఎక్కువ సంఖ్యలోనే నివసిస్తున్నారు. అలాగే ఇతర ప్రధాన నగరాల్లో కూడా తెలుగువారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రపంచంలోని ప్రధాన పట్టణాల్లో కూడా తెలుగువారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తెలుగు భాషకు ఘనకీర్తి ఉన్నా దాని అమలుకు మాత్రం ప్రభుత్వాలు అనుకున్నంత శ్రద్ధ వహించిన చరిత్ర లేనేలేదు. అధికార భాషగా తెలుగు వెలుగొందినా, తర్వాత్తర్వాత ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమా అని తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గింది. ఆంగ్లమాద్యమంపై దృష్టి పెరిగింది. ప్రైవేటు పాఠశాలలు అన్నీ ఆంగ్లమాద్యమంవైపే దృష్టి పెట్టాయి. సచివాలయం మొదలు జిల్లాల్లో ఉండే కలెక్టరేట్ల వరకూ అన్ని కార్యాలయాలు ఆంగ్లంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, న్యాయస్థానాల్లో తెలుగులో తీర్పులు ఇచ్చే యంత్రాంగం, మంత్రాంగం లేక ఆంగ్లంలోనే కార్యకలాపాలు కొనసాగడంతో తెలుగు భాషకు అనుకున్నంత ప్రాధాన్యత లభించలేదు. అడపాదడపా అధికార భాషా సంఘం కొన్ని చర్యలు చేపట్టినా, తెలుగు అకాడమి జన రంజక గ్రంథాలు మార్కెట్‌లోకి తీసుకువచ్చినా, తెలుగు యూనివర్శిటీసహా కొన్ని ఉన్నత విద్యాసంస్థలు తెలుగు భాషాభివృద్ధి కోర్సులను నిర్వహించినా అనుకున్నంతగా తెలుగుకు ప్రాధాన్యత దక్కలేదు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎల్‌కేజీ మొదలు ఇంటర్మీడియట్ స్థాయి వరకూ తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలనే నిబంధన విధించడం తెలుగు భాషకు కొత్త సొబగు తెస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దాంతోపాటు తెలుగుభాషాభివృద్ధికి మరిన్ని చర్యలను తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తెలుగు అమలుకు గట్టిచర్యలు చేపట్టింది. మరోపక్క న్యాయస్థానాలు సైతం తెలుగులో తీర్పులు ఇస్తున్నాయి. సచివాలయం నుండి ఉత్తర్వులు తెలుగులో వెళ్తున్నాయి. తాజాగా చేపట్టిన ఈ చర్యలు ఎంతవరకూ సత్ఫలితాలను ఇస్తాయో నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.