ఫోకస్

విద్యార్థులపై శ్రద్ధ పెట్టడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్సిటీ ఫ్యాకల్టీలు విద్యార్థులపై శ్రద్ధ పెట్టకపోవడం కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక ప్రధాన కారణం. నిత్యజీవితంలో కొన్ని సంఘటనలో విఫలం కావడం, మరికొందరు విద్యార్థులు ప్రేమలో ఓడిపోవడం లాంటి సంఘటనలు కూడా వారిని ఆత్మహత్యకు ప్రేరేపించవచ్చు. రోజురోజుకు వయస్సు పెరిగిపోవడంతో ఇక జీవితంలో సెటిల్ అవుతామా లేదా అనే అభద్రత భావం కూడా వారికి కలుగుతుంది. విద్యార్థులు చదువు మరిచి ఏకాగ్రత కోల్పోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మాత్రం ఆయనను కళాశాల నుండి సస్పెండ్ చేయడంతోనే జీవితంపై అభద్రత భావానికి లోనై, ఇక తన భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళన చెందే ఆత్మహత్య చేసుకున్నట్లు నేను భావిస్తున్నాను. రిసెర్చ్ కాలర్స్‌పై ఒత్తిడి తీవ్రమైన ప్రభావం చూపుతుంది. విద్యార్థులు ఫ్రస్టేషన్‌కులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ సరిగ్గా లేకపోవడం కూడా ఒక సమస్యే. మరోవైపు యూనివర్సిటీలో యూనియన్లు, రాజకీయాలు విపరీతమయ్యాయ. విద్యార్థులకు సరైన గైడెన్స్, కౌన్సిలింగ్ చేసేవారు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ పరిస్థితులు తెలివైన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ. వారి అవకాశాలను సైతం దెబ్బతీస్తున్నాయ.

- కె.చిరంజీవులు, (ఐఏఎస్) వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్‌చాన్స్‌లర్