ఫోకస్

బీజేపీకి ఇబ్బందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీకి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవక తప్పదనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో వరుసగా ఆరోసారి ఈ పార్టీ విజయం సాధించినా, సీట్ల సంఖ్య తగ్గడం నైతికంగా ఆ పార్టీకి ఇబ్బందే. గుజరాత్‌లోని వాద్‌నగర్ (మోదీ సొంత ఊరున్న నియోజకవర్గం) అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. మొత్తం మీద గుజరాత్‌లోని పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలల్లో కూడా బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. గుజరాత్ అభివృద్ధే దేశాభివృద్ధి కాజాలదు. గుజరాత్ అభివృద్ధి దేశానికి ఆదర్శం కూడా కాదు. గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ తన ప్రచారంలో రాహుల్‌గాంధీ ప్రతిష్ఠను ఫణంగా పెట్టారు. రాజకీయాలు ఎలా ఉన్నా, ఒక జాతీయ నాయకుడు రాష్ట్ర ఎన్నికల్లో తీసుకున్న ఈ కోణం సరైంది కాదు. గుజరాత్ అభివృద్ధిలో డొల్లతనం ప్రజలకు అర్థమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అవినీతి, అంతర్గత కలహాలు ఆ పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలు అధికార పార్టీపై ప్రజలకు అసంతృప్తి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ మళ్లీ అధికారం నిలుపుకోవడం కష్టమే. అదే విధంగా భవిష్యత్తులో బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీకి మళ్లీ గెలుపు ఖాయమని ఎవరూ చెప్పలేరు. జాతీయ స్థాయి అంశాలు పరిశీలిస్తే పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి తదితర అంశాలవల్ల సంక్షోభం చెలరేగి అసంఘటిత రంగంలో 10 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ‘‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సొసైటీ’’ చేసిన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది కార్మిక వర్గాల్లో అల్లకల్లోలం రేపింది. జిడిపిలో వేతనాల నిష్పత్తి క్రమంగా క్షీణిస్తోంది. జాబ్ ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయి. పాత పెన్షన్ విధానంపై ఇప్పటికే ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రైవేట్ కంపెనీలకు మేలుచేసే చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కల్పన లేకపోవడం, బ్యాంకింగ్ రంగంలో కష్టాలు మోదీ ఓట్‌బ్యాంక్‌పై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. ఇవన్నీ భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఎన్నికల ఫలితాలు మళ్లీ వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. కాని 2019 ఎన్నికలు నువ్వా-నేనా అన్న రీతిలో ఉంటాయని చెప్పకతప్పదు.
సి. ప్రభాకర్‌రెడ్డి, రాజకీయ విశే్లషకుడు