ఫోకస్

అభివృద్ధికే ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రజల్లో మార్పు వచ్చింది, మాటలకు- చేతలకు ఉన్న తేడాను గమనిస్తున్నారు. గతంలో హామీలు చూసి ఓట్లు వేసే రోజులు ఇపుడు లేవు. నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనలో ప్రపంచంలోనే వివిధ రంగాల్లో అగ్రస్థానానికి ఎగబాకుతోంది. ఆర్థిక రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని సంతరించుకుంది. రక్షణ రంగంలో , అంతరిక్ష రంగంలో, పొరుగు దేశాలతో స్వాభిమానంగా వ్యవహరించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇన్ని అంశాలతో పాటు అవినీతి లేని పాలనను దేశ ప్రజలు స్వాతంత్య్రానంతరం తొలి సారి చూస్తున్నారు. వీటన్నింటి ఫలితమే ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు. గుజరాత్ ప్రజలు నరేంద్రమోదీ పాలనను చూసి ఓట్లు వేశారు. గుజరాత్ గెలుపు కాదన్నట్టు, అక్కడ కాంగ్రెస్ ఏదో సాధించినట్టు కొంత మంది కుహనా విశే్లషకులు చెబుతున్నారు. కిరాయి నాయకులతో జట్టుకట్టి, కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోని హామీలతో, కులం పేరుతో అనేక రకాలుగా రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిందో దేశ ప్రజలకు అందరికీ తెలుసు. కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు బలం కాదు.. వాపు మాత్రమే. ఆప్ 11 మందిని నిలిపిందని, చివరికి కొన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీకి సమర్పించుకుంది. గుజరాత్, హిమాచల్ మాత్రమే కాదు, దేశంలో మున్ముందు జరిగే అన్ని ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం.
- జి కిషన్‌రెడ్డి బీజేపీ శాసనసభాపక్ష నేత, తెలంగాణ