ఫోకస్

హడావుడి తప్ప.. ప్రయోజనంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదు. ఇదంతా పార్టీ నేతల హడావిడే. భౌగోళిక.. రాజకీయ.. సామాజిక స్థితిగతులు వేరు.. అక్కడే పూర్తిస్థాయిలో ఈ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించలేకపోయింది.. కొద్దోగొప్పో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కనుక గుజరాత్‌లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఫలితాలున్నాయి.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా పూర్తిస్థాయిలో బీజేపీ పట్టు సాధించలేకపోయింది.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఫలానా పని చేశాం అని చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ప్రధానంగా పోలవరం... విశాఖ రైల్వేజోన్.. రాజధాని ఆర్థిక సాయం వీటిపై ప్రజల్లో ఏ రకంగా ప్రచారం చేస్తారనేది సందేహాస్పదం. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు వేరు.. దేశం మొత్తంగా ప్రయోజనాలు వేరు. గుజరాత్‌లో బీజేపీ మంత్ర అంతంతమాత్రంగా ప్రభావం చూపింది. ఏపీలో ఆ పార్టీకి గతంలో ఒక్కసీటు కూడా లేదు. స్వయంశక్తిగా ఎదిగే అవకాశంలేదు. వచ్చే ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు రాష్ట్రానికి విభజన చట్టం హామీలన్నింటిటీ షెడ్యూల్డ్ ఆస్తులతో సహా బదలాయించినా అది సాధ్యపడపకపోవచ్చు. రైల్వేజోన్ అంశానికి వస్తే ఒడిశా పరిధిలోని ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో అత్యధికభాగం 60 శాతం వరకు ఆదాయం వార్తేరు డివిజన్ నుంచే వస్తోం. జోన్ అధికారికంగా ప్రకటించటంలో ఇప్పటి వరకు స్పష్టతలేదు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను బేరీజు వేసుకునే ఏపీకి అరకొర సాయం అందిస్తున్నారు. విభజన చట్టంతోపాటు వౌఖికంగా ఇచ్చిన హామీలు రెవిన్యూలోటు భర్తీ తదితర అంశాలపై దృష్టి సారించటంలేదు. షెడ్యూల్డ్ ఆస్తుల బదలాయింపు జరిగితే ఉపాధికల్పనకు ఆస్కారం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరి పోరుతో చిక్కులు తప్పవు. ప్రస్తుతం మంజూరైన జాతీయ సంస్థలు కొన్నింటికి ప్రహరీగోడ నిర్మించే పరిస్థితులు కూడా లేవు. స్థానిక సమస్యలను పరిష్కరించకుండా గుజరాత్ గెలుపే పరమావధిగా ఏపీపై ప్రభావం ఉంటుందనే వితండవాదన సరైందికాదు.
- శ్రీరాం మాల్యాద్రి పార్లమెంటు సభ్యులు, బాపట్ల