ఫోకస్

దేశవ్యాప్తంగా మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవిఘ్నంగా మోదీ కొనసాగారు. గుజరాత్‌లో బిజెపి సాంకేతికంగా గెలుపొందినా, నైతికంగా ఓడిపోయినట్లే. ప్రధాని మోదీకి ప్రతిష్ఠాత్మకమైన సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్లు బలమైన పోటీనిచ్చింది. అక్కడ బిజెపికి 99 సీట్లు వస్తే మా పార్టీకి 80 సీట్లు లభించాయి. అంటే ప్రజలు బిజెపి పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో స్పష్టమవుతోంది. గుజరాత్‌లో బిజెపి ఓటమి చవిచూస్తే దేశ వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని, తన ఇమేజ్, గ్రాఫ్ పడిపోయిందని ప్రజలు అనుకుంటారని భావించిన ప్రధాని తన సర్వశక్తులు ఒడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా, 50 మంది కేంద్ర మంత్రులు, 122 మంది ఎంపీలు ప్రచారం చేశారు. ఇంతమందిని ఎదిరించేలా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కరే ప్రచారం చేయడాన్ని గమనించాలి. లోగడ ఎబి వాజ్‌పేయ్, ఎల్‌కె అద్వానీ విలువలతో కూడిన రాజకీయాలు చేశారే తప్ప ఇలా దిగజారి ప్రచారం చేయలేదు. 2012 ఎన్నికల్లో బిజెపి 115 స్థానాల్లో విజయం సాధిస్తే, ఇప్పుడు 99కే ఎందుకు పరిమితమైంది. ఓట్ల శాతం విషయానికి వస్తే 2014 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి 60 శాతం ఉంటే ఇప్పుడు 49 శాతానికి తగ్గింది. కాంగ్రెస్‌కు 33 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగితే ఇంకా ఓట్ల శాతం, సీట్లు పెరగాలే తప్ప ఎందుకు తగ్గాయి. రాహుల్ గాంధీని ఎదుర్కొనేందుకు ప్రధాని తన స్థాయిని దిగజారి విమర్శలు చేశారు. చివరకు తనపై హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు. కుల, మతాలను అడ్డుపెట్టుకుని బిజెపి గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్నా, 2019లో జరగబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. నేటి యువతకు రాహుల్ గాంధీ ఆదర్శం. రాహుల్ కోసం దేశం ఎదురు చూస్తున్నది.
- ఎన్. రఘువీరా రెడ్డి అధ్యక్షుడు,