ఫోకస్

ప్రభుత్వాల జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధుల్లో పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ సీబీఐ, ఏసీబీ, సీఐడీ వంటి నేర పరిశోధనా సంస్థలకు స్వయం ప్రతిపత్తి లేకపోయినా వాటి విచారణలో ప్రభుత్వాల అనవసర జోక్యం లేకుండా ఉంటే చాలు. తాజాగా టూజీ స్ప్రెక్టం కేసు న్యాయస్థానంలో వీగిపోయిన దరిమిలా అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇటు పరిశోధనా సంస్థ గాని అటు ప్రాసిక్యూషన్ సంస్థ గాని తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించుకోలేకపోవటమే దీనికి కారణంగా కన్పిస్తుంది. అసలు ఒక కీలకమైన కేసు పరిశోధన సమయంలో మధ్యలోనే విచారణాధికారిని బదిలీ చేస్తుండటం వారి స్థానంలో వచ్చే అధికారికి ఆ కేసు పట్ల పూర్తి అవగాహన లేకపోవటం వల్ల కూడా కీలకమైన చార్జిషీటు దాఖలులో అంతులేని జాప్యం జరుగుతున్నది. ప్రతిపక్ష నేత జగన్ కేసు ఇందుకు చక్కటి ఉదాహరణ. అసలు ఒక కేసులో ఒక్కో సెక్షన్ కింద ఒక్కో చార్జిషీటు దాఖలు ఎందుకో అర్థం కావటం లేదు. అన్నింటి మించి సాక్షులకు రక్షణ లేకుండా పోయింది. న్యాయస్థానాల ప్రాంగణాల్లోనే హత్యలకు గురవుతున్నారు. దీనికితోడు వేర్వేరు కారణాలతో దశాబ్దాల తరబడి కేసు విచారణ జరుగుతుండటంతో సాక్షుల్లో తొలినాటి ఆశలు తగ్గిపోయి వారి ఆలోచనా విధానాల్లో మార్పులొస్తున్నాయి. దేశ చరిత్రలో ఇప్పటివరకు భయపెట్టి సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగాలపై ఒక్క కేసు కూడా నమోదైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే వివిధ కేసుల పరిశోధనల్లో ఉండేవారికి ప్రభుత్వాలు ఇతర బాధ్యతలు అప్పగిస్తుండటం వల్ల కూడా వారు ఏ ఒక్క కేసుపై కూడా తగినంత శ్రద్ధ చూపలేకపోతుండటం వల్ల కూడా తగిన న్యాయం జరగటం లేదన్నది అక్షర సత్యం.
- సోము కృష్ణమూర్తి అధ్యక్షుడు, విజయవాడ బార్ అసోసియేషన్