ఫోకస్

పేరుకే ప్రతిపత్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో రాజకీయ జోక్యం లేని సంస్థంటూ ఏదీ లేదు.. ఇందుకు కారణం సంస్థలకు ఆర్థికపరమైన వనరులను ఆయా ప్రభుత్వాలు సమకూర్చడమే. రాష్ట్ర హైకోర్టులు, సుప్రీం కోర్టులతో సహా నియామకాలను, వివిధ సంస్థల్లో పోస్టింగులను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. ఇందుకు సీబీఐ కూడా భిన్నం కాదు. దేశంలోని ప్రతి దర్యాప్తు సంస్థ సాంకేతికంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ, వ్యవహారికంగా ఆయా ప్రభుత్వాల చెప్పుచేతుల్లో ఉండి తీరాల్సిందే. ఇందుకు గతంలో సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌గా ప్రచారం జరిగింది. అయితే న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు మాత్రం పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటారు. కోర్టులను కూడా ప్రభావితం చేసే కొందరు వ్యక్తులు లేకపోలేదు. అన్నిచోట్లా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కొందరు న్యాయమూర్తులు కూడా కొన్ని అంశాలకు ప్రభావితమవుతున్నారు. దర్యాప్తు సంస్థలు ఇనె్వస్టిగేషన్ ఎంత బాగా చేసినప్పటికీ సాక్ష్యాలను కోర్టులో సరైన సమయానికి దాఖలు పర్చినప్పుడే కేసు నిలబడుతుంది. ఎక్కువ శాతం న్యాయమూర్తులు సాక్ష్యాలపై మాత్రమే ఆధారపడతారని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. 2జి కేసు విఫలం కావడానికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే కారణం. ప్రస్తుతం దేశానికి కొత్త చట్టాలు, సంస్థలకు కొత్త అధికారాలు ఏమాత్రం అవసరం లేదు. రాజకీయ నాయకుల చొరబాటు లేకుండా ఉన్న అధికారాలను పూర్తిగా వినియోగించుకునే స్వేచ్ఛ కలిగితే వ్యవస్థ గాడిలోనే ఉంటుంది. లోకాయుక్త, విజిలెన్స్ వంటి సంస్థలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా పనిచేస్తున్నాయంటే ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయా సంస్థలతోపాటు ఏ సంస్థలోనూ పదవీ విరమణ చేసిన వారిని నియమించకూడదు. 2జి కేసులో కూడా రాజకీయ జోక్యం షరామామూలుగానే ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం అధికారంలోకి రాగానే పాత అంశాలను తవ్వి కేసులు బనాయించడం రివాజుగా మారుతోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొత్తమీద రాజకీయ నాయకుల జోక్యం ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థలు ఆయా ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే వారు పడిన కష్టానికి ఫలితంతోపాటు ఆయా సంస్థలపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
- జస్టిస్ కెజి శంకర్ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి