ఫోకస్

ఒత్తిళ్ళు లేకుండా ఉండాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2జి స్కాం కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. 35 మంది నిందితులను నిర్దోషులని తీర్పిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని ఆశ్చర్యకరమైన, సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించారు. అయితే ఈ తీర్పు సీబీఐకి వ్యతిరేకంగా వచ్చిందని, సీబీఐ కోర్టు పలు విషయాలపై ఘాటుగా వ్యాఖ్యానించిందని, సీబీఐ సరైన సాక్ష్యాలు కోర్టు ముందుంచడంలో విఫలమైందని, దీంతో నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించిందని తెలుసుకున్నాం. ఈ దశలో సీబీఐపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ప్రతి కేసులో అభియోగ, ఆరోపణలు చేయడం, అభియోగ పత్రం దాఖలు చేయడం, ప్రాసిక్యూషన్ తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి ఆరోపణలను రుజువు చేసేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. వీటిని కోర్టు పరిగణనలోకి తీసుకుని తీర్పిస్తుంది. కొన్నిసార్లు కేసులో సరైన ఆధారాలు లేవని, నిందితులను నిర్దోషులుగా ప్రకటించవచ్చు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇది ప్రతి క్రిమినల్ కేసులో జరిగే ప్రక్రియ. కానీ, ఇదే తుది తీర్పు కాదు. సీబీఐ పైకోర్టులో అప్పీలు చేసుకునే వెసులుబాటుంది. ఈ కేసులో సిబిఐ అప్పీలు ఫైలు చేసి కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ, అందులో న్యాయపరమైన అంశాలను హైకోర్టు ముందుంచి, సాక్ష్యాలను కింది కోర్టు సరిగ్గా బేరీజు వేయలేదని, తీర్పు సరైనది కాదని సిబిఐ విన్నవిస్తుంది. హైకోర్టు వాద, ప్రతివాదనలు విని కింది కోర్టు తీర్పును కొట్టివేయవచ్చు లేదా ఖరారు చేయవచ్చు. ఆ తర్వాత కేసు నెగ్గని వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఈ క్రమంలో సీబీఐ సరైనా సాక్ష్యాలను చూపలేదని అనడం తొందరపాటు వ్యాఖ్యానంగా ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఈ మధ్య జరిగిన జయలలిత కేసును చెప్పవచ్చు. సీబీఐ ప్రతిష్ఠ తాత్కాలికంగా మసిబారినట్లు అనిపించినా, ఇది ఒక ప్రతిష్ఠాత్మకమైన వ్యవస్థ. ఎన్నో క్రిమినల్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసింది. 2జి స్కాం కేసులో ఇప్పుడు సీబీఐని తప్పుపట్టడం తొందరపాటు చర్యగానే భావించాలి. ఎన్నో కేసుల్లో కింది కోర్టు తీర్పులను పైకోర్టులు కొట్టి వేసి నిందితులకు శిక్ష వేసిన దాఖలాలున్నాయి. కాబట్టి అప్పీలు తీర్పు వచ్చేవరకు ఆగడం సీబీఐకి మనం ఇవ్వాల్సిన కనీస గౌరవం. సీబీఐని స్వయం ప్రతిపత్తిగల సంస్థగా మార్చడం చాలా అవసరం. కానీ ఏ ప్రభుత్వం కూడా స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ముందుకు రాలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. రాజకీయ వత్తిళ్ళు లేకుండా చేయాలంటే సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలి. లేకపోతే ప్రజల్లో అనుమానాలుంటాయి.
- కె. మాణిక్ ప్రభు సీనియర్ న్యాయవాది, హైకోర్టు