ఫోకస్

పాక్ సంబంధాలు బాగాలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌తో భారతదేశానికి సంబంధాలు బాగాలేవు. పాకిస్తాన్ అనుసరిస్తున్న దౌత్యసంబంధాల తీరులో బాగా మార్పులు రావాలి. మన దేశానికి చెందిన జాదవ్ కుటుంబం పట్ల పాకిస్తాన్ అనుసరించిన తీరు అమానవీయం, గర్హనీయం. అలాంటి చర్యలను పాకిస్తాన్ మానుకోవాలి. దౌత్యసంబంధాల విషయంలో పాకిస్తాన్‌కు భారత్ దీటైన సమాధానం ఇవ్వాలి. జాదవ్ కుటుంబాన్ని భారత ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. భారత్‌లోకి పాకిస్తాన్ తీవ్రవాదుల చొరబాట్లను ఆ దేశమే అరికట్టాలి. దౌత్యసంబంధాలు బాగుంటేనే పాకిస్తాన్, భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉండవు. తీవ్రవాదుల పట్ల పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకుని వారిని మనదేశంలోకి పంపే చర్యలను పాకిస్తాన్ మానుకోవాలి. తీవ్రవాదులకు నల్లధనం అందకుండా పాకిస్తాన్ చర్యలు చేపట్టాలి. ఈ చర్యలన్నీ తీసుకుంటేనే భారతదేశంతో పాకిస్తాన్‌కు సంబంధాలు మెరుగుపడతాయి.
- వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు