ఫోకస్

భారత్‌తో దోబూచులాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాద సమస్యపై భారత్‌తో పాక్ దోబూచులాడుతోంది. భారత్‌కు ఎప్పుడూ సహకరించింది లేదు. ముంబయి పేలుళ్ల వ్యవహారం, ఆ తరువాత ఎన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా భారత్‌పై వ్యతిరేక శక్తుల్ని ఎగదోస్తుంది. కులభూషణ్ జాదవ్ విషయంలో అదే జరిగింది. అతనిని అక్రమంగా అరెస్టు చేసి భారత్ గూఢచారి అని భారత్ పరువును మంటగలపడానికి ప్రయత్నించింది. ఈ పరిస్థితిలో భారత్ కూడా అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ మమ్మల్మి మోసం చేసిందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాద చర్యలు చేస్తున్నట్టు అమెరికాకు నిరూపితమైంది. కనుక ఇలాంటి పరిస్థితిలోనే ఏకాకిని చేయాలి. ఇందుకోసం పాక్ తీరును మరింత బహిర్గతపరచాలి. దౌత్యం ద్వారానే మనం విజయం సాధించాలి. భారత్‌తో పాకిస్తాన్‌కు సంబంధాలు మెరుగ్గా లేవు. దానివల్ల మనకు వచ్చిన నష్టం లేదు. మన ధృడవైఖరి మనల్ని కాపాడుతోంది. పాక్ చుట్టూ ఉన్న దేశాలతో మనం వాణిజ్యపరంగా సహకారం అందించి పాక్‌ను ఏకాకిని చేయాలి. ఇక కాశ్మీర్ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇటీవల కాలంలో కాశ్మీర్‌లో కొంత అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. గతంలో అక్కడ విద్యార్థులు, ముస్లింలు సైనికులపై రాళ్లు రువ్వే కార్యక్రమం చేసి మనల్ని భయపెట్టేవారు. ఇపుడు కాశ్మీర్ ప్రాంతంలో తీవ్రవాదులను ఏరివేయడం ద్వారా ఉగ్రవాద సమస్యను బాగా అదుపులోకి తీసుకువచ్చారు. కాశ్మీర్ ప్రాంతంలో శాంతికోసం భారత్ ప్రభుత్వం ఇటీవల కమిటీని నియమించిన విషయం విదితమే. భారత్ ఇదే వైఖరి కొనసాగిస్తే సరిపోతుంది.
- డాక్టర్ డివిజి శంకరరావు మాజీ ఎంపీ, విజయనగరం