ఫోకస్

శాంతియత్నాలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతికాముక దేశమైన భారత్, విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మన దేశం స్నేహ సంబంధాలు కొనసాగించే దిశగా ఎన్నో అడుగులు వేస్తున్నా, పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు ప్రాంతంలో నిరంతరం దాడులకు పాల్పడుతూ శాంతి ప్రయత్నాలకు భంగం కలిగిస్తూనే ఉంది. 1947లో బ్రిటిష్ ప్రభుత్వము ఇండియా, పాకిస్తాన్‌గా విభజించినప్పటికీ భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, మతపరంగా ఈ రెండు రాజ్యాల మధ్య ఎలాంటి పోలికలూ లేవనే చెప్పొచ్చు. దురదృష్టవశాత్తూ ఈ రెండు రాజ్యాలూ ఎన్నటికీ మంచి మిత్రులు కాలేకపోయాయి. దక్షిణాసియాలో ప్రజాస్వామ్య శాంతిని స్థాపించాలంటే అణ్వాయుధ సంపత్తి కలిగిన భారత్, పాక్ మధ్య శాంతిని స్థాపించాల్సిన అవసరం ఉంది. ద్వైపాక్షికంగా చర్చలద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు భారత్ దృఢచిత్తంతో కృషి చేస్తోంది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అణచివేయడం, ముఖ్యంగా నవంబర్ 26 ముంబై దాడిలో పాల్గొన్న తీవ్రవాదులపై చర్యలు తీసుకోండని పాకిస్తాన్‌పై భారత్ ఎంత ఒత్తిడి చేసినా ఆ యత్నాలు వృథా అయ్యాయి. కాశ్మీర్ సమస్యను ఒక అంతర్జాతీయ సమస్యగా అనేక అంతర్జాతీయ వేదికలపై పాక్ చిత్రీకరించే ప్రయత్నం చేయడంతోపాటు అణ్వాయుధ, రసాయన ఆయుధాల సమస్యతో ముడిపెడుతోంది. ఈ జటిల సమస్య పరిష్కారం కావాలంటే కాశ్మీర్‌తో సహా పాక్‌తో ఉన్న అన్ని సంబంధాలను దృఢతరం చేయాల్సి ఉంది. ఆర్థిక రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులను, దేశీయ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించడం, ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థను నెలకొల్పడం, పాకిస్థాన్‌లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో ఫలవంతమైన చర్చలు, జరపడం, తీవ్రవాద నిర్మూలనకు అంతర్జాతీయ ఆర్థిక సాయం నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య శాంతి, సామరస్యాలు ఏర్పడి, ద్వైపాక్షిక, వాణిజ్య అభివృద్ధి, పర్యాటక రంగ అభివృద్ధి వెరసి ఆర్థికాభివృద్ధికి మార్గం సుగుమవుతుంది.
- డాక్టర్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి హెచ్‌ఓడీ, పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, అనంతపురం.