ఫోకస్

అవి కవ్వింపు చర్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంపై పాకిస్తాన్ నిరంతరాయంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్‌ను భారత్‌సహా అన్ని దేశాలూ హెచ్చరిస్తున్నప్పటికీ వారికి బుద్ధి రావడం లేదు. పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ స్నేహ సంబంధాలనే కోరుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య సంబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పాక్ అనాగరిక చర్యలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దేశానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించేది లేదని ప్రకటించారు. పాక్ చర్యలపట్ల యావత్ ప్రపంచం విచారాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మన దేశ సరిహద్దుల్లో అశాంతికి పాక్ కారణమవుతోంది. మన దేశంపైకి తీవ్రవాదులను ఉసిగొల్పుతూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం ఆ దేశంతో చర్చలు జరపకపోవడమే మంచిది. దేశ సరిహద్దుల్లోకి చొరబాట్లను ప్రోత్సహించిన పక్షంలో పాక్ భారీమూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మనదేశం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతి ఒక్కరు సమర్థించాలి. దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాజకీయాలకు అతీతంగా మద్దతునివ్వాలి. ఒకవేళ పాక్ ప్రభుత్వం తీవ్రవాదాన్ని కట్టడిచేసి, శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపేందుకు పాక్ ముందుకువచ్చిన పక్షంలో అందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
- తోట నరసింహం కాకినాడ ఎంపీ, లోక్‌సభలో టీటీపీ పక్ష నేత