ఫోకస్

అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ విభజన నాటి నుండి కూడా భారత్ పట్ల పాకిస్తాన్ శతృవైఖరి కొనసాగుతూనేవుంది. గతంలో రెండు పర్యాయాలు భారత్‌తో యుద్ధాలకు దిగి నష్టపోయినా పాకిస్తాన్ గుణపాఠం నేర్వలేదు. కాశ్మీర్ సమస్యను ఆసరాగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదంతో భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు, దాడులు చేస్తోంది. భారత్‌ను దెబ్బతీసే లక్ష్యంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇతర దేశాలను ఇబ్బందుల పాలు చేసేలా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ వైఖరి మానవ సమాజానికి చేటుగా మారింది. ఐక్యరాజ్య సమితిలో, అంతర్జాతీయ వేదికలపై పాక్ ఉగ్ర బుద్ధిని ఎండగట్టి ఆ దేశాన్ని ఏకాకిగా చేసేందుకు దౌత్యపర యత్నాలు విస్తృతం చేయాలి. అటు పాక్ ఉగ్రమూకలు, పాక్ సైన్యం సాగిస్తున్న ఉగ్రదాడులను తిప్పికొట్టడంలో భారత్ మరింత కఠిన వైఖరి అనుసరించాలి. పాక్ ఉగ్రమూకల శిబిరాల ధ్వంసం చేసే క్రమంలో మరిన్ని సర్జికల్ దాడులు అవసరం. ఇంకోవైపు పాకిస్తాన్‌కు ఇతర దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా, చైనా వంటి దేశాల నుండి ఆర్ధిక, పారిశ్రామిక, ఆయుధ సహకారాలను అందకుండా చేయాలి. ఈ దిశగా ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా పాక్‌కు ఆర్ధిక సహాయం నిలిపివేయాలన్న వ్యాఖ్యానించడం ఉగ్రమూకల పోషణ సాగిస్తున్న పాక్‌కు గట్టి ఎదురుదెబ్బే. పాకిస్తాన్‌కు ఇంతకాలం సాయం చేయడం పొరపాటన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను చైనా కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. చైనా కేవలం భారత్ ఎదుగుదలపై అసూయతో పాక్‌కు సహాయకారిగా ఉంటుంది. అమెరికా తరహాలో చైనా కూడా పాక్‌కు సహాయంపై పునారాలోచన చేసుకోవాలి. ఉగ్రవాదంపై పోరుకు సహకరించిన పాక్‌కు ఏ దేశం కూడా సహకరించరాదన్న సందేశాన్ని అమెరికా వంటి ఉగ్రవ్యతిరేక దేశాల సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ విస్తృత ప్రచారం సాగించాలి. కాశ్మీరీలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా భారత్ నూతన చర్యలు చేపట్టాలి. పొరుగుదేశాలతో అంతర్జాతీయంగా శాంతిని కోరుకునే భారత్ పట్ల పాకిస్తాన్ శతృవైఖరి దీర్ఘకాలికంగా ఆ దేశానే్న దెబ్బతీస్తుంది. పాక్ పాలకులు ఉగ్రవాద పోషణపై చూపుతున్న శ్రద్ధను ఆ దేశ అభివృద్ధి పట్ల చూపకపోవడం విచారకరం. ఉగ్రదాద మూకల కేంద్రంగా పాకిస్తాన్ కొనసాగడం ద్వారా ఆ దేశ అభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోంది. చివరకు పొరుగుదేశాల సాంప్రదాయాలను గౌరవించాలన్న సంస్కారం, విచక్షణ, కనీస మానవత విలువలు సైతం కోల్పోయిన పాక్‌లో మార్పుకు ఉదారవాద వైఖరి పనికిరాదు. పాక్‌లో ఖైదీగా ఉన్న కులభూషన్ యాదవ్‌తో ఆయన భార్య, తల్లి భేటీ సందర్భంగా పాక్ వ్యవహరించిన తీరు భారత్‌ను అవమానించడంగానే భారత ప్రజలు భావిస్తున్నారు. మొత్తంగా హింసా, యుద్దోన్మాద వైఖరిలతో మనుగడ సాగించాలనుకునే పాక్ పట్ల భారత్ అంతర్జాతీయ దేశాల మద్ధతుతో దౌత్యపరంగా, ఆర్థికంగా, సైనికంగా దాడులు ఉదృతం చేయాలి.
- డాక్టర్ బి.్ధర్మానాయక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డీనేటర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా