ఫోకస్

ఆంధ్రాలో టీడీపీకే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాంక్షలు నెరవేర్చే పార్టీలకే ప్రజలు పట్టం కడతారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టిఆర్‌ఎస్‌లకే అవకాశం ఉంది. ఆయా పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమేగాక, ఎన్నికల ప్రణాళికలో లేని హామీలను సైతం నేరవేరుస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రావాల్సి ఉంది. కాని ఈ ఏడాది నవంబర్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని మీడియా చెబుతోంది. ఎన్నికలు ఎపుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ ఇష్టం, ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల అభిప్రాయాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే తేదీలను నిర్ణయిస్తుంది. ఏడాది చివరిలో అయితే పరీక్షలకు, విద్యుత్ సౌకర్యాలకు, ఇతర అంశాలకు అనువైనదే. ఎన్నికల తేదీలకు సంబంధించి స్పష్టత వచ్చినపుడే రాజకీయ పార్టీల్లో చేరికలు, పార్టీలను వీడి ఇతర పార్టీల్లో చేరే అంశాలపై లెక్కలు తేలుతాయి. వాస్తవానికి ఇది అంచనాలకు అందని సమయం. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నపుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలకే ప్రజలు మళ్లీ పట్టం కడతారు. ఏ పనీ చేయకపోతే తప్ప సహజంగా ఆయా పార్టీలపై అపుడే వ్యతిరేకత అనేది ఉండదు. ఆంధ్రాలో, తెలంగాణలో అధికార పార్టీలకే ఆ విధంగా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రజలకు సంబంధించిన వౌలిక సదుపాయాలపై పనిచేసే ప్రభుత్వాలకు ఎలాంటి తిరుగు ఉండదు. వ్యవసాయం, నీటి పారుదల ప్రాజెక్టులు, అందరికీ ఇళ్లు, వైద్య సదుపాయాలు, పట్టణీకరణ, రోడ్లు, తాగునీటి సదుపాయాలు, రవాణా సౌకర్యాలపై దృష్టిపెట్టినపుడు ప్రజలు ఆ ప్రభుత్వాలకే పట్టం కడతారు. ఇన్ని చేసినా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలపైనే ప్రజలకు దృష్టి ఉంటుంది. వితంతు పెన్షన్లు, వృద్థాప్యపు పెన్షన్లు, పౌర సరఫరాలు, గ్రామాభివృద్ధి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో పౌష్టకాహారం వంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది. కాని చదువుకున్నవారు, పట్టణాల్లో ఉన్న వారు మాత్రం ఉపాధి అవకాశాలు, నగరీకరణ, ఐటి అభివృద్ధి, పరిశ్రమలు, విద్యుత్ సౌకర్యం వంటి వాటిపై దృష్టి పెడతారు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మంచి అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికావస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలకు పెద్ద పీట వేస్తున్నాయి. సర్వీసు కమిషన్లు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇంతవరకూ యువతలో ఉన్న అసంతృప్తి సైతం వీటితో తీరింది. ఇక విపక్షం విషయానికి వస్తే ఆనాడు చిరంజీవికి సైతం లక్షలాది మంది చూడడానికి వచ్చినా, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే, అదే కోణంలో చూస్తే వైకాపా అధినేత జగన్‌కు పెద్ద ఎత్తున జనం వస్తున్న మాట నిజమే, కాని ప్రజలు ఎంతవరకూ నమ్ముతారనేది ప్రశ్నార్థకం.
- ప్రొఫెసర్ జి సూర్యనారాయణ మాజీ చైర్మన్, ఏపీపీఎస్‌సీ