ఫోకస్

మరో చరిత్ర సృష్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనూ దూసుకెళుతున్నాం. 1982 సంవత్సరంలో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించినప్పుడు, మేకప్ వేసుకునే వ్యక్తి రాజకీయాల్లోకి రావడమా!? అంటూ కొంత మంది అపహాస్యం చేశారు. కానీ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అంటే 1983 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా టీడీపీ దూసుకెళుతున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైంది. ఇప్పట్లో కోలుకుని పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు విశ్వాసం లేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు హాజరవుతున్నారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇక తెలంగాణలో టీడీపీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. అధికారపక్షం కొన్ని రకాల ప్రలోభాలకు గురిచేసి కొంతమంది తెలుగుదేశం నాయకులను ‘కారు’లో ఎక్కించుకున్నంత మాత్రాన తెలంగాణలో టీడీపీ లేనేలేదనుకోవడం భ్రమ. టీడీపీ ప్రజల గుండెల్లో చెక్కు చెదరలేదు. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం సమయంలోనే టీఆర్‌ఎస్‌కు 62 స్థానాలు లభిస్తే, మా పార్టీకి 15 స్థానాల్లో ప్రజలు విజయం చేకూర్చారు. అంతెందుకు 2004 సంవత్సరంలో తెలంగాణలో టీడీపీకి ప్రజలు 50 స్థానాల్లో విజయం చేకూర్చారంటేనే ప్రజాదరణ ఎలా ఉందో స్పష్టమవుతున్నది. నాయకులు ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తే పార్టీ బలహీనపడదు. ఆ నాయకులూ ఒకప్పుడూ సామాన్య కార్యకర్తలే అనే విషయాన్ని గమనించాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తమ పార్టీ కార్యకర్తలను సుశిక్షితులైన కార్యకర్తల్లా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఇటీవల ఎన్టీఆర్ భవన్‌లో శిక్షణా తరగతులు ప్రారంభించి, మూడవ బ్యాచ్‌కు శిక్షణ ఇస్తున్నాం. విషయం ఏమిటంటే నియోజకవర్గానికి వెయ్యి మందికి శిక్షణ ఇవ్వాలనుకుంటే అంతకుమించి కార్యకర్తలు ఉత్సాహంగా రావడం మాకే ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కలుపుకుని, మరో పార్టీని పూర్తిగా విలీనం చేసుకుని, ఇదే బలం అనుకుంటే పొరపాటే అవుతుంది. తాజాగా తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికను పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు స్వతంత్ర అభ్యర్థి దినకరన్‌ను గెలిపించి, ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు ‘కర్రు కాల్చి వాత పెట్టారు’. కాబట్టి టీఆర్‌ఎస్ అహం వీడి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ‘మరో చరిత్ర’ సృష్టించబోతున్నది.
- ఎల్. రమణ అధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ