ఫోకస్

సినీరంగానికి ‘నోచాన్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాజకీయాల్లో తమిళనాడు తరహా సినిమారంగం ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇక్కడి జనానికి సినిమా పిచ్చిగాని, సినిమా తారలను నెత్తిన ఎక్కించుకోవాలన్న యావగానీ లేదు. సినిమాలను కేవలం ఎంటర్‌టైన్‌కోసం మాత్రమే చూస్తారు. సినిమాల్లో నటించేవారు కానీ, సినిమా రంగంతో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సంబంధాలు ఉన్నవారికి కాని పరిపాలనాపరమైన పగ్గాలు ఇవ్వాలన్న కాంక్షలేదు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి బలహీనవర్గాలకు చెందిన చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓడిపోయారు. అంటే ఎన్‌టీఆర్‌లాంటి వాడిని కూడా తెలంగాణ ప్రజలు అవసరమైతే తిరస్కరిస్తారని నిరూపణ అయింది. అందువల్ల సినిమా రంగం వాళ్లకు తెలంగాణ రాజకీయాల్లో అవకాశాలు తక్కువగా ఉంటాయి. తెలంగాణ గడ్డ పోరాటాలకు నెలవుగా చెప్పుకోవచ్చు. 1948 కంటే ముందు నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ప్రపంచంలోనే ఒక రికార్డును నెలకొల్పింది. నిజాం కబందహస్తాల నుండి హైదరాబాద్ స్టేట్‌కు విముక్తి కల్పించి, విశాల భారత్‌లో కలిపిన చరిత్ర తెలంగాణ ప్రజలు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత తెలంగాణకు నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని మరోసారి ఉద్యమించిన తెలంగాణ ప్రజలు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నీరాజనం పలుకుతున్నారంటే ఈ పోరాటం ఎంత నిర్మలమైందో, ఎంత న్యాయమైందో స్పష్టమైంది.
ఇప్పుడు తెలంగాణ పునర్మిర్మాణం ప్రారంభమైంది. తెలంగాణ సాధనకోసం పోరాడిన కేసీఆర్, ఆయన పార్టీ తిరిగి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్ల ప్రజలు ఓవరాల్‌గా సంతృప్తిగానే ఉన్నారు. అణగారిన వర్గాలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్నాయి. అయితే ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగానే ఉండాల్సిన అవసరం ఉందని వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలకోసమే ఉద్యోగులు పనిచేయాలి. విధి నిర్వహణ సక్రమంగా, నీతిగా, ధర్మంగా నిర్వర్తించాలి. పరిపాలనలో అవినీతిని అంతమొందించేందుకు కేసీఆర్ ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండాలి. టీచర్లు, ఉద్యోగులు తాము తీసుకునే వేతనానికి న్యాయం చేసేలా, తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రతి ఉద్యోగి బంగారు తెలంగాణ కోసం పనిచేయాలే తప్ప లంచాలకోసం, సొంత స్వార్థంకోసం పనిచేయకూడదు. ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ తదితర అంశాల్లో ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వ విధానాలు ఉంటే బాగుంటుంది. మంచిపాలన అందించే రాజకీయ పార్టీలకే ప్రజలు మళ్లీ మళ్లీ అధికారం కట్టబెడతారనడానికి గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ కూడా ఇదేవిధంగా నిలుస్తుందని భావిస్తున్నాను.
- కె. శ్రీనివాసరావు రాజకీయ విశే్లషకుడు