ఫోకస్

బాబు చొరవ హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన దగ్గర్నుండి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటి రంగాభివృద్ధికి చంద్రబాబు ఎంతగా కృషి చేశారో తెలిసిందే! అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సాగాలంటే పరిశ్రమల స్థాపన తప్పనిసరని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి అనేక దేశాలలో పర్యటించి మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకున్న అవకాశాలను వివరిస్తున్నారు. తద్వారా పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చూపుతున్న చొరవను నేడు అంతా అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న సింగిల్ విండో విధానంతో అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకువచ్చిన పక్షంలో ఏకగవాక్ష విధానంలో అన్ని రకాల అనుమతులను మంజూరు చేస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పించడం, వౌళిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుండటంతో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగమం అవుతోంది. ప్రభుత్వం కల్పిస్తోన్న అవకాశాల కారణంగా అనేక బడా కంపెనీలు ఇతర రాష్ట్రాలను కాదని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నాయి.
- తోట నరసింహం కాకినాడ ఎంపీ, లోక్‌సభలో టీడీపీ పక్ష నేత