ఫోకస్

సదస్సులు తప్ప.. పెట్టుబడులేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో ఇనె్వస్టర్ల సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. వాస్తవానికి వచ్చిన పరిశ్రమలు అయితే కన్పించడం లేదు. ఇనె్వస్టర్ల సదస్సులు నిర్వహించిన ఆ రెండు రోజులు హడావుడి కన్పిస్తొంది. లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయి అని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి వంద కోట్ల పెట్టుబడులు కూడా రావడం లేదు. మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాయితీల కోసమైన కొన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎక్సయిజ్ సుంకంలో రాయితీలు వర్తిస్తాయి. ఇతర పన్నులు ఉండవు. అందువల్ల కొత్త పారిశ్రామిక వేత్తలు కూడా పరిశ్రమలు నెలకోల్పేందుకు ఉత్సాహం చూపుతారు. ప్రత్యేక హోదా దక్కకపోవడంతో ఎక్కువగా నష్టపోయాం. ఒకవేళ పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యాలు చూపించలేకపోతుంది. అందువల్ల వోక్స్‌వాగన్, ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఇదిలా ఉండగా మరోపక్క ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో జ్యూట్, ఫెర్రోఅల్లాయిస్, ఇతర చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిని తెరిపించే నాధుడే లేడు. రాష్ట్ర విభజన వల్ల 60 శాతం ఆదాయం ఇచ్చిన హైదరాబాద్‌ను కోల్పోయాము. ఇక తలసరి ఆదాయం అంకెలు చూడటానికి బాగానే కన్పిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆ అంకెలు నమ్మశక్యంగా లేవు. ఈ ఏడాది రాష్ట్ర తలసరి ఆదాయం 1.7 లక్షలుగా గణాంకాలు చూపుతున్నారు. వాస్తవానికి ఆ మేరకు పేదలకు వాటి ఫలాలు అందడం లేదు. కాగితాల వరకే అభివృద్ధి ఎక్కువగా కన్పిస్తోంది.
- డాక్టర్ డివిజి శంకరరావు మాజీ ఎంపీ, విజయనగరం.